- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా రైతు ఖాతాలో రూ. 10 కోట్లు.. ఆమె చేసిన పనికి హాట్సాప్
ఖాతాలో పొరపాటున పది కోట్లు జమ అయినా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెనక్కి ఇచ్చేసిన యూపీ మహిళా రైతు రీటా నిజాయతీకి దేశం ఫిదా!

దిశ, వెబ్ డెస్క్: ఓ సాధారణ మహిళా రైతు ఖాతాలో రూ. 10 కోట్లు జమ కావడం, ఆమె చేసిన పనికి గ్రామంలోని అంతా ప్రశంసలు కురిపించడం ప్రస్తుతం హాట్ టాపికిగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మైన్‌పురి జిల్లాకు చెందిన రీటా అనే మహిళా రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున దాదాపు రూ. 10 కోట్లు జమ అయ్యాయి. సాధారణంగా అంత పెద్ద మొత్తంలో డబ్బు కనిపిస్తే ఎవరైనా తడబడతారు. కానీ రీటా మాత్రం వెనువెంటనే స్పందించారు. "ఆ సొమ్ము నాది కాదు.. దానిని వెనక్కి తీసుకోండి" అంటూ స్వయంగా బ్యాంకు అధికారులకు సమాచారం అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కేవలం అధికారులకు చెప్పడమే కాకుండా, తన కుటుంబ సభ్యులకు కూడా ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు, బ్యాంకులో ఉన్న తమ సొంత డబ్బును కూడా ముట్టుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. తన అసాధారణ నిజాయతీతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆశకు తావులేకుండా, కష్టపడి సంపాదించిన రూపాయికే విలువ ఉంటుందని నిరూపించిన రీటా ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాలంలో ఇలాంటి నిస్వార్థపరులు ఉండటం నిజంగా అరుదని నెటిజన్లు కొనియాడుతున్నారు.






