Mumbai rains: ముంబాయిలో భారీ వర్షాలు..ఏకంగా రోడ్డుపైకే వచ్చిన కొండచిలువ..వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

ముంబాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Mumbai rains: ముంబాయిలో భారీ వర్షాలు..ఏకంగా రోడ్డుపైకే వచ్చిన కొండచిలువ..వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ముంబాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డపైకి వరద నీరు భారీగా చేరుకుంది. ఈ క్రమంలో ముంబాయిలో మెయిర్ రోడ్డు పక్కనే ఉన్న ఓ కాలువలో నుండి ఏకంగా పెద్ద కొండ చిలువ బయటకు వచ్చింది. కొండ చిలువ తల భాగాన్ని పైకి పెట్టి మిగితా శరీరం అంతా నీటిలోనే పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటోంది.

ఇక దాన్ని చూసిన వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. నావి ముంబాయి ప్రాంతంలో భారీ పైతాన్ రోడ్డుపైకి వచ్చినట్టు వీడియోలో పేర్కొన్నారు. అశ్తివీ నాయక్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుండగా ఒక్కరోజులోనే 183కే లైక్స్ వచ్చాయి. లైక్స్ తో పాటూ కామెంట్స్ కూడా ఎక్కువే వస్తున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ముంబాయి లాంటి నగరంలోకి కొండ చిలువ రావడం ఏంటి అని అవాక్కవుతున్నారు. అడవులను నరికివేయడం వల్లనే ఇలా రోడ్లపైకి పాములు వస్తున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Next Story