- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టపగలు.. దర్జాగా.. నగలు కొట్టేసిన దంపతులు.. వీరి స్కిల్స్‌కు ఓ దండం పెట్టాల్సిందే..!
ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో మహిళ చేసిన దొంగతనం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతోంది. డీఎం కాలనీ రోడ్‌లో ఉన్న గౌరవ్ పండిట్ జ్యువెల్లర్ షాప్‌కు వచ్చింది ఓ జంట. ఖరీదైన

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో మహిళ చేసిన దొంగతనం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్రెండ్ అవుతోంది. డీఎం కాలనీ రోడ్‌లో ఉన్న గౌరవ్ పండిట్ జ్యువెల్లర్ షాప్‌కు వచ్చింది ఓ జంట. ఖరీదైన ఆభరణాలు చూపించడమని అడగడంతో ఓనర్ గౌరవ్, సిబ్బంది ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పురుషుడు అందరి దృష్టి ఆభరణాల మీద నిలిపేలా చేయగా.. ఆయనతో వచ్చిన స్త్రీ ఆరు తులాల నగను కొట్టేసింది. ఆ తర్వాత క్యాజువల్‌గా ఇద్దరు కలిసి వెళ్లిపోయారు. అయితే రాత్రి షాప్ క్లోజ్ చేసే ముందు నగ మిస్ కావడంతో.. సీసీటీవీ ఫుటేజీ చెక్ చేయగా.. ఈ దొంగతనం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కొట్టేసిన బంగారు ఆభరణం విలువ ఆరు లక్షలకు పైనే ఉంది.
Next Story






