- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్‌లో పోర్న్ సినిమాలు.. బిగ్ స్క్రీన్‌పై బూతులో తప్పేముంది.. కోట్ల మంది కోరుకునేదాన్ని... ప్రముఖ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
మనుషులంతా ఒకలాగా ఆలోచిస్తే ఆర్జీవీ మరోలాగా ఆలోచిస్తాడని చర్చించుకుంటారు సోషల్ మీడియా ఫాలోవర్స్. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. మనుషులన్నాక ఆలోచించి.. పది మందికి నచ్చింది.. చేయాలనుకుంటారు. కానీ ఆర్జీవీ అలా కాదు తనకు నచ్చిందే మాట్లాడుతాడు..

దిశ, ఫీచర్స్ : మనుషులంతా ఒకలాగా ఆలోచిస్తే ఆర్జీవీ మరోలాగా ఆలోచిస్తాడని చర్చించుకుంటారు సోషల్ మీడియా ఫాలోవర్స్. ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. మనుషులన్నాక ఆలోచించి.. పది మందికి నచ్చింది.. చేయాలనుకుంటారు. కానీ ఆర్జీవీ అలా కాదు తనకు నచ్చిందే మాట్లాడుతాడు.. అదే చేస్తాడు కూడా. అందుకే ఈయన లాగా ఒక్కరోజైనా బతకాలని.. అంత స్వేచ్ఛగా మాట్లాడాలని చాలా మంది అనుకుంటారు. ఇక సెక్స్, అమ్మాయిల విషయానికి వస్తే మరీ బోల్డ్‌గా మాట్లాడే వర్మ.. బిగ్ స్క్రీన్‌పై బూతులు వాడటం గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
ఇంటర్నెట్ యాక్సెస్‌తో జస్ట్ ఒక్క క్లిక్ దూరంలోనే పోర్న్, రియల్ లైఫ్ వాయిలెన్స్ అందుబాటులో ఉంటుందని.. అలాంటప్పుడు చిన్న చిన్న బూతు పదాలను మూవీ నుంచి ఎందుకు కట్ చేయాలని ప్రశ్నించాడు. ఎంటర్‌టైన్మెంట్‌ను రిస్ట్రిక్ట్ చేయడంలో సెన్స్ ఏముందంటున్న ఆయన.. సెన్సార్ బోర్డ్ అవుట్‌డేట్ అని, స్టుపిడ్ థింగ్ అని విమర్శించాడు. అసలు ఏ నాలెడ్జ్ లేని ఐదుగురు సభ్యులు.. కోట్ల మంది కోరుకునే ఎంటర్‌టైన్మెంట్‌ను ఎలా డిసైడ్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘అంటే నీ ఉద్దేశం ఏంటి థియేటర్‌లో పోర్న్ సినిమాలు చూడాలా?’ ‘సీక్రెట్‌గా చూసే పోర్న్‌ను 70ఎంఎం స్క్రీన్‌పై చూస్తూ ఎంజాయ్ చేయాలా?’, ‘ఇలా చూసే చిన్న పిల్లలు కూడా రేపిస్టులు అవుతున్నారు. హత్యలు చేస్తున్నారు. సమాజం పూర్తిగా చెడిపోతుంది’, ‘మియా మాల్కోవా షార్ట్ ఫిల్మ్స్ నీ తల్లితో కలిసి చూడగలవా’, ‘డ్రగ్స్ ఈజీగా దొరుకుతున్నాయని వాడి పాడైపోమని చెప్పగలమా?’ అని తిట్టిపోస్తున్నారు జనాలు.






