- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పక్షిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన యువకుడు.. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోన్న వీడియో
కళ్లెదురుగా మనిషి ప్రమాదంలో ఉంటేనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలన్న ఆత్రుతే తప్ప కాపాడాలన్న సోయి ఒక్కరికీ ఉండదు. స్వార్థం, నిర్లక్ష్యం పేరుకుపోయిన ఈ రోజుల్లో ఓ యువకుడు ఓవర్ హెడ్ వైర్లలో చిక్కుకున్న పక్షిని కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: కళ్లెదురుగా మనిషి ప్రమాదంలో ఉంటేనే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలన్న ఆత్రుతే తప్ప కాపాడాలన్న సోయి ఒక్కరికీ ఉండదు. స్వార్థం, నిర్లక్ష్యం పేరుకుపోయిన ఈ రోజుల్లో ఓ యువకుడు ఓవర్ హెడ్ వైర్లలో చిక్కుకున్న పక్షిని కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. పంజాబ్ లో జరిగిన ఈ సంఘటనలో యువకుడు తన ప్రాణాలకు తెగించి పక్షిని కాపాడటంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో.. యువకుడు ఒక క్రేన్ కు వేలాడుతూ.. పక్షి చిక్కుకున్న తీగలకు దగ్గలగా వెళ్లాడు. కరెంట్ పోల్ తీగల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పక్షిని రక్షించేందుకు పదునైన ఆయుధంతో ఆ తీగలను కట్ చేసినట్లు కనిపిస్తోంది. కాసేపటికి ఆ పక్షి తీగల చిక్కుల నుంచి విడుదలై.. హమ్మయ్య ప్రాణాలతో బయటపడ్డాననుకుంటూ ఎగిరి పోయింది. అనంతరం క్రేన్ ఆ వ్యక్తిని సేఫ్ గా కిందికి దించింది. అతని మనసు చాలా మంచిదని, అందుకే కరెంట్ తీగల్లో చిక్కుకున్న పక్షిని మానవత్వంతో కాపాడాడని, ఇలాంటి సంఘటనలు చూసినపుడే మానవత్వం ఇంకా బ్రతికే ఉందని అనిపిస్తుందని, రియల్ లైఫ్ హీరో అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Read More..
రెండు బస్సుల మధ్య నుజ్జునుజ్జయిన ఆటో.. నెట్టింట వీడియో వైరల్






