- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ ఇస్మార్ట్ శంకర్.. మెదడులో చిప్‌తో జీవిస్తున్న వ్యక్తి
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) మూవీ చూసే ఉంటారు కదా! అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరో రామ్ మెదడులోకి మరో వ్యక్తి జ్ఞాపకాలను ఓ చిప్‌ను (Chip) అమర్చి ట్రాన్స్‌ప్లాంట్ (Transplant) చేస్తారు. నిజానికి అలా ఎక్కడైనా చేస్తారా? మనిషి మెదడు ఒక ఎలక్ట్రానిక్ చిప్ కంట్రోల్ చేయటం ఏంటి? సినిమాలో కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతాయని అనుకుంటాం మనం. కానీ, నిజంగానే ఓ వ్యక్తి మెదడులో చిప్‌తో జీవిస్తున్నాడు. మరీ ఈ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అమెరికాకు చెందిన నోలాండ్ అర్బాగ్ (Noland Arbaugh) అనే 30 ఏళ్ల యువకుడు 2016లో పక్షవాతం బారిన పడ్డాడు. ఎంత మంది వైద్యుల వద్ద చికిత్స చేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ సంస్థ న్యూరాలింక్ (Neuralink) 2024లో అతడిని ఓ ప్రయోగంగా వాడుకోవాలనుకుంది. అందుకోసం అతడిని సంప్రదించగా.. పక్షవాతం కారణంగా ఇతరుల సాయంతో జీవించటం విసిగిపోయిన నోలాండ్ ప్రయోగానికి అంగీకరించాడు. ఇందులో భాగంగా ఆరేళ్ల ఒప్పందంపై మెదడు ఆలోచనలను కంప్యూటర్ ఆదేశాలుగా పనిచేసే ఓ చిప్‌ను నోలాండ్ మెదడులో ప్రవేశపెట్టింది న్యూరాలింక్. దీనిని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) అని పిలుస్తారు.
మనుషులు ఆలోచనల నుంచి ఉత్పన్నమయ్యే చిన్న విద్యుత్ ప్రేరణలను గుర్తించి, వాటిని డిజిటల్ కమాండ్‌లోకి అనువదించి ఈ చిప్ పనిచేస్తుంది. చిప్ అమర్చిన శస్త్రచికిత్స తర్వాత స్పృహలోకి వచ్చినప్పుడు, మొదట తన వేళ్లను తిప్పడం గురించి ఆలోచించడం ద్వారా స్క్రీన్‌పై కర్సర్‌ను నియంత్రించగలిగానని నోలాండ్ వివరించారు. అయితే, ఇది విజయం సాధించినప్పటికీ ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉన్నప్పటికీ న్యూరాలింక్ నుంచి మెదడులో చిప్ అమర్చుకున్ తొలి వ్యక్తిగా నోలాండ్ నిలిచాడు.






