- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపం ర్యాపిడో డ్రైవర్.. తీవ్రంగా బాడీ షేమింగ్ చేసిన యువతి (వీడియో)
డిగ్రీలు, పీజీలు చదివిన ఉద్యోగాలు రాక యువత ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారు కొందరైతే, ఒకరికింద పనిచేయాల్సిన అవసరం ఏంటని చిన్నా, చితక గల్లీ వ్యాపారాలు చేసుకునే వారు మరికొందరు.

దిశ, డైనమిక్ బ్యూరో : డిగ్రీలు, పీజీలు చదివిన ఉద్యోగాలు రాక యువత ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వారు కొందరైతే, ఒకరికింద పనిచేయాల్సిన అవసరం ఏంటని చిన్నా, చితక గల్లీ వ్యాపారాలు చేసుకునే వారు మరికొందరు. చేతిలో ఉన్న బైక్ ద్వారా రోజువారిగా డబ్బులు సంపాదించుకునేలా, చిన్న ఉద్యోగం చేస్తూ పార్ట్ టైంలో కూడా పనిచేస్తూ ఎంతో కొంత వెనకేసుకోవచ్చనే ఉద్దేశ్యంతో ర్యాపిడో, ఓలా, ఉబర్ రైడర్‌లుగా పనిచేస్తుంటారు. ఇలా పొట్టకూటి కోసం ఎవరికి తోచిన పని వారు చేసుకుంటూ బతుకుతారు. కానీ, ఇక్కడా అవమానాలు తప్పట్లేవు. బతుకుదెరువు కోసం ర్యాపిడో నడుపుతున్న ఓ యువకుడ్ని అవమానపరిచింది యువతి. ఒక మహిళ ర్యాపిడోలో రైడ్ బుక్ చేసింది.. అయితే అతను కాస్త లావుగా (పొట్టతో) ఉన్నాడు. అయితే ఆమె ఆ రైడ్ ను క్యాన్సిల్ చేసింది. ఈ నేపథ్యంలోనే రైడర్‌ను వీడియో తీసి బాడీ షేమింగ్ చేసింది. ఆ వీడియోలో రైడర్ మొత్తం స్థలాన్ని ఆక్రమించినందున తాను రైడ్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. వీడియోను రికార్డ్ చేసి షేర్ చేసినందుకు సదరు యువతిపై నెటిజన్లు మండిపడ్డారు.






