డీఐజీ సార్ నాకు న్యాయం చేయండి.. నన్ను రేప్ చేసిన ఇద్దరు దర్జాగా తిరుగుతున్నరు.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-14 13:40:55  IST  )

ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని ఖుర్జా కోత్వాలీ ప్రాంతానికి చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆరుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడగా.. నలుగురు మాత్రమే శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరు బయట హాయిగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత

డీఐజీ సార్ నాకు న్యాయం చేయండి.. నన్ను రేప్ చేసిన ఇద్దరు దర్జాగా తిరుగుతున్నరు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని ఖుర్జా కోత్వాలీ ప్రాంతానికి చెందిన మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆరుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడగా.. నలుగురు మాత్రమే శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరు బయట హాయిగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత మహిళ తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఈ విషయాన్ని డీఐజీకి చెప్పి .. న్యాయం కోరాలనుకుంది. ఈ క్రమంలోనే డీఐజీ కళానిధి నైథానీని కలిసేందుకు చాలా ప్రయత్నించింది. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యంగా ఇన్‌స్పెక్టర్ పంకజ్ రాయ్ బాధితురాలిని ఆపేందుకు అనేక మంది పోలీసులను డ్యూటీలో ఉంచారు. ఆమె డీఐజీ దగ్గరకు పరుగెడుతుంటే.. లాగేసే ప్రయత్ం చేశారు. కానీ బాధితురాలు చివరకు డీఐజీ వాహనం దగ్గరకు చేరుకుని.. తన బాధను చెప్పుకుంది.

బాధితురాలి ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న డీఐజీ.. ఇద్దరి అరెస్ట్, దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఇన్‌స్పెక్టర్ పంకజ్ రాయ్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఆ మహిళ ధైర్యానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Click For Twitter Post .....

Next Story