తల్లడిల్లిపోయిన మహేశ్ బాబు, Jr.NTR.. మొత్తానికి రజినీకాంత్‌ను కాపాడేశారు!

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-14 15:16:53  IST  )

ఏఐ వచ్చాక.. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు.

తల్లడిల్లిపోయిన మహేశ్ బాబు, Jr.NTR.. మొత్తానికి రజినీకాంత్‌ను కాపాడేశారు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐ వచ్చాక.. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. ఎవరికి వారు ఇష్టానుసారం వీడియోలు క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అవి కాస్త వైరల్ అయిపోవడం జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఏఐ వల్ల హీరో, హీరోయిన్లతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. సమాజానికి ఉపయోగపడేలా మంచి చెప్పేలా కొన్ని వీడియోలు ఉంటే.. హీరోయిన్లను అసభ్యంగా చూపించే వీడియోలు మరికొన్ని నెటింట్ట పోస్టు చేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యంతో బాధపడుతుంటే.. చూసి తట్టుకోలేకపోయిన మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్.. ఎండల్లో కూలి పనిచేసి మరీ డబ్బులు సంపాదించి రజినీకాంత్‌కు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయిస్తారు’ ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా అవుతోంది.

Next Story