- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజిల్ తో కారు వాషింగ్ చేస్తూ రీల్స్.. కానీ చివరికి ట్విస్ట్ ఏంటంటే
SUV కారును ఏకంగా డీజిల్ తో వాష్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు రీల్స్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా చమురు కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో LPG షార్టాజ్ తో జనాలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ SUV కారును ఏకంగా డీజిల్ తో వాష్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు రీల్స్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని సిరోహి ప్రాంతంలో చోటు చేసుకుంది.
డీజిల్ తోనే కారు వాషింగ్
రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి అనాదరా ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్ లో స్కార్పియో SUV కారును డీజిల్ తో ఇద్దరు వ్యక్తులు కడిగారు. అచ్చం షోరూంలో కార్లను కడిగినట్లుగానే డీజిల్ ను ఉపయోగించి, వాష్ చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చమురు కొరత ఉన్న నేపథ్యంలో ఇలా డీజిల్ తో కార్లను కడిగి రీల్స్ చేయడం హాట్ టాపిక్ అయింది. అంతేకాదు డీజిల్ తో కడిగేటప్పుడు, చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే..మొత్తం బూడిదే అవుతుంది. ఇక ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.
రీల్స్ చేసిన ఇద్దరు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్ చేశారు. పెట్రోల్ పంప్ లాంటి అత్యంత సున్నితమైన చోట ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రమాదకరమని పోలీసులు వెల్లడించారు. ఒకవేళ చిన్న ప్రమాదం జరిగితే... మొత్తం తగలబడి పోతుందని తెలిపారు. అందుకే నిందితులపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేశామని వివరించారు.






