- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Favourite Actor: నా ఫేవరెట్ యాక్టర్ మోడీ.. రాజస్థాన్ బీజేపీ సీఎం హాట్ కామెంట్స్ రచ్చ!
రాజస్థాన్ బీజేపీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్ బీజేపీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ (Rajasthan BJP CM Bhajanlal Sharma) తాజాగా చేసిన హాట్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఇష్టమైన నటుడని ఆయన మాట్లాడారు. ఆదివారం రాత్రి జైపూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల ప్రదానోత్సవంలో జర్నలిస్టులతో జరిగిన సంభాషణలో సీఎం భజన్‌లాల్ ఈ వ్యాఖ్య చేశారు. సినిమాకు సంబంధించిన ఫంక్షన్ కావడంతో ఓ జర్నలిస్ట్.. మీకు ఇష్టమైన నటుడు ఎవరని సీఎంను ప్రశ్నించారు. సీఎం చిరునవ్వు నవ్వుతూ ‘నరేంద్ర మోడీ జీ’ అంటూ సమాధానం ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో (Congress) కాంగ్రెస్, ఆప్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
దీనిపై రాజస్థాన్ స్టేట్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా (Govind Singh Dotasra) ఎక్స్ వేదికగా స్పందించారు. మేము చాలా కాలంగా చెబుతున్నాము.. మోడీ నాయకుడు కాదు.. నటుడు అని.. ఆలస్యంగా అయిన బీజేపీ నాయకులు గుర్తించారని ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందిస్తూ.. మీరు చెప్పింది నిజమే భజన్ లాల్, ప్రధాని మోడీ మంచి నటుడు.. కానీ కొన్నిసార్లు ఆయన అతిగా నటిస్తారని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, సీఎం చేసిన వ్యాఖ్యలు నెట్టింట రచ్చ రచ్చ అయింది. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారోనని దుమారం రేగుతోంది.






