- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాచ్‌ను ఆపేసిన వర్షం.. నెటిజన్ ట్వీట్‌కు తెలంగాణ వెదర్‌మ్యాన్ ఫన్నీ రిప్లై
హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. భారీ వర్షం (Heavy Rain) కారణంగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న కీలక పోరుకు అడ్డంకిగా మారింది. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులు చేసింది. సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభానికి ముందు వర్షం మొదలైంది. అయితే వర్షం కొద్దిసేపట్లో తగ్గిపోయినా, మైదానంపై నీరు నిలిచిపోయిన కారణంగా మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించగా, SRH ప్లేఆఫ్ ఆశలపై నీళ్లు పోసింది.
ఇదంతా ఒక వైపు అయితే, మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై ఫన్నీ ట్వీట్లు వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ ట్విటర్‌లో ఫన్నీగా 'రేయ్.. ఇవాళ మ్యాచ్ ఉందని తెలిసి కూడా వర్షాన్ని ఆపలేవేంట్రా?' అంటూ తెలంగాణ వెదర్‌మ్యాన్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి వెదర్‌మ్యాన్ తనదైన శైలిలో చమత్కారించాడు. 'నేను కేవలం వర్షాన్ని అంచనా వేయగలను కానీ, వర్షాన్ని ఆపలేను బ్రో. బహుశా వచ్చే జన్మలో ప్రయత్నిస్తాను' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇక దీనిపై నెటిజన్లు మీమ్‌లు, జోకులతో స్పందిస్తూ తెగ వినోదాన్ని పంచుకుంటున్నారు.
Nen rain ni predict chestha kaani rain ni aapalenu bro. May be in my next life, I may try 🥲 https://t.co/Raqcy43pTt
— Telangana Weatherman (@balaji25_t) May 5, 2025






