కాలనీగా మారిపోయిన రైల్వే ప్లాట్‌ఫామ్‌ (వీడియో)

by Gantepaka Srikanth |

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుతోంది.

కాలనీగా మారిపోయిన రైల్వే ప్లాట్‌ఫామ్‌ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో కాలుష్యం (Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుతోంది. వరుసగా మూడో రోజు మంగళవారం కూడా గాలి నాణ్యత సూచిక చాలా పేలవమైన కేటగిరిలో నమోదైంది. ఇవాళ రాజధాని ప్రాంతంలో ఓవరాల్‌ ఏక్యూఐ 309గా ఉన్నట్లు సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ తెలిపింది. కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత పడిపోతోంది. దీనిపై రాజకీయ నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా.. నాయకులందరూ కలిసి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ భయంకర పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ చర్యలకైనా మద్దతు ఇవ్వాలని రాజకీయ నేతలను కోరారు. ఇదిలా ఉంటే.. వాయు కాలష్యం కారణంగా ప్రజలు సేఫ్ ప్లేస్‌లు వెతుక్కొని అక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే రైల్వే ప్లాట్‌ఫామ్‌ను కాలనీగా మార్చేసిన ఢిల్లీ నగర వాసులు. ఆజాద్‌పూర్ రైల్వే స్టేషన్‌(Azadpur Railway Station)లోని ఓ ప్లాట్‌ఫామ్‌పై ఇండ్లు నిర్మించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో రైల్వే అధికారులు ఏం చేస్తున్నారని జనం నిలదీస్తున్నారు. వీడియో

Next Story