- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం రాపిడో (Rapido), ఇతర డెలివరీ యాప్స్ ద్వారా వస్తువులను పంపిస్తుంటాం. కానీ, ఓ రాపిడో డ్రైవర్‌కు మాత్రం ఎవరూ ఊహించని వింత పార్శిల్ ఎదురైంది. ఒక కస్టమర్ తన పెంపుడు కుక్కను ఒకచోట నుంచి మరో చోటికి చేర్చమని కోరడంతో ఆ డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. వివరాల్లోకి వెళితే.. బెంగుళూరుకు చెందిన ఒక రాపిడో డ్రైవర్‌కు పార్శిల్ డెలివరీ కోసం ఆర్డర్ వచ్చింది. అక్కడికి వెళ్లి చూడగా, ఒక మహిళ ఒక బుట్టను అతడి చేతికి ఇచ్చింది. అందులో ఏముందో చూసిన డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ పార్శిల్ మరేదో కాదు.. ఎంతో ముద్దుగా ఉన్న ఒక నల్లటి లాబ్రడార్ (Labrador) కుక్కపిల్ల.
రాపిడో డ్రైవర్ రియాక్షన్ ఇదే..
మొదట ఆశ్చర్యపోయిన ఆ రాపిడో డ్రైవర్ ఎంతో ప్రేమగా ఆ కుక్కపిల్లని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ‘జీవితం ఎక్కడికి చేరుకుంది? పార్శిల్ పేరుతో జనం ఏమైనా పంపిస్తున్నారు. అసలు ఇది ఎలాంటి పార్శిల్?’ అంటూ అతను సరదాగా నవ్వుతూ కామెంట్ చేశాడు. ఆ కుక్కపిల్ల కూడా ఏ మాత్రం భయం లేకుండా, ఒక కో-రైడర్ (Co-rider)లా బైక్ మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదించడం అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఇది నిజంగా బెస్ట్ పార్శిల్!’ ఇలాంటి ఆర్డర్ వస్తే ఆ రోజంతా ఎంతో సంతోషంగా ఉంటుందని ఒకరు కామెంట్ చేశారు.‘డెలివరీ బాయ్ లక్ మామూలుగా లేదు.. అతడికి మంచి కంపెనీ దొరికింది’ అని మరొకరు కామెంట్ చేశారు.






