- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిందూర్ పెట్టుకోను, మంగళసూత్రం వేసుకోను.. వివాదాస్పదంగా మారిన లేడీ సైకాలజిస్ట్ కామెంట్స్
హిందూ సాంప్రదాయంలో పెళ్లి తరవాత మహిళలు నుదుటిన సిందూరం, మొడలో మంగళసూత్రం ధరించడం అనేది ఆచారం అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కాలం మారిపోయింది. చాలా మంది ఆ ఆచారాలను పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: హిందూ సాంప్రదాయంలో పెళ్లి తరవాత మహిళలు నుదుటిన సిందూరం, మొడలో మంగళసూత్రం ధరించడం అనేది ఆచారం అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కాలం మారిపోయింది. చాలా మంది ఆ ఆచారాలను పట్టించుకోవడంలేదు. ఈ క్రమంలో ఓ కంటెంట్ క్రియేటర్ చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియోపై విమర్శలు వస్తాయని కూడా క్రియేటర్ ముందే చెప్పింది. దివిజ అనే సైకాలజిస్ట్ మరియు కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను చేసింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ... తాను పెళ్లి చేసుకున్నానని కానీ సిందూరం పెట్టుకోనని చెప్పింది.
అంతే కాకుండా తాను మంగళసూత్రాన్ని ధరించను అని, తన భర్త పేరును ఇంటిపేరుగా మార్చుకోలేదని వెల్లడించింది. పెళ్లి తరవాత తన భర్తకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి మార్పు లేనప్పుడు తాను మార్చుకోవాల్సిన అవసరం ఏం ఉంది అని ప్రశ్నించింది. వీటికి బదులు తాను, తన భర్త ఒకేలా ఉండే బ్రాస్ లెట్స్ ధరించామని చెప్పింది. తన తల్లి దండ్రులు వాళ్ల ఇంట్లోనే ఉంటున్నారని, తన భర్త తల్లిదండ్రులు కూడా వారి ఇంట్లోనే ఉంటున్నారని పేర్కొంది. ఇంటి అద్దెను ఇద్దరం సమానంగా కడుతున్నామని, తాను కూడా ఉద్యోగం చేస్తున్నానని తెలిపింది.
పెళ్లికి ముందు ఎలాంటి దుస్తులు ధరించానో ఇప్పటికే అలాంటివే ధరిస్తానని, తనకు వివాహం అంటే ప్రియుడితో కలిసి ప్రతిరోజు గడపడం మాత్రమే అని తెలిపింది. వివాహం ఎప్పుడూ భయంకరమైన అనుభవంగా ఉండకూడదని వ్యాఖ్యానించింది. ఇక్కడ స్త్రీ ప్రతిదీ మార్చుకోవాల్సి ఉంటుందని, పురుషుడు తన కుటుంబంతో కలిసి జీవించగలడని పేర్కొంది. వివాహం ఇద్దరికీ సమానత్వం ఇస్తుంది కానీ మన సమాజమే దానిని అసమానంగా మార్చేస్తుందని ఆరోపించింది. ఇక దివిజ చేసిన వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొంతమంది ఆమెతో ఏకీభవించినప్పిటికీ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాలు సైతం మనల్ని గౌరవించడానికి కారణం వివాహ వ్యవస్థే కానీ కొందరు దానిని నాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. మరికొందరు దివిజ చెప్పింది నిజమే అని ఇద్దరికీ వివాహం తరవాత సమాన స్వేచ్చ, ఇష్టాలను కలిగి ఉండాలని కామెంట్ చేస్తున్నారు. video






