నిజమైన ప్రేమకు నిదర్శనం.. నెట్టింట హృదయాన్ని హత్తకునే వీడియో వైరల్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-10 07:11:45  IST  )

ఈ పక్షులు ఒక్కసారి జంటగా ఏర్పడితే.. జీవితాంతం ఆ భాగస్వామితోనే కలిసి ఉంటాయి. ఒకవేళ రెండింట్లో ఒకటి చనిపోతే, మరొకటి ఒంటరి జీవితాన్నే గడుపుతుంది.

నిజమైన ప్రేమకు నిదర్శనం.. నెట్టింట హృదయాన్ని హత్తకునే వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ.. కేవలం మనుషులకు మాత్రమే సొంతమైన అనుభూతి అని అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే.. జంతువులు, పక్షులు కూడా ప్రేమించుకుంటాయి. కలిసి తమ జీవితాన్ని పంచుకుంటాయి. నిజానికి చెప్పాలంటే మనుషుల మధ్య కంటే కూడా జంతువులు, పక్షుల ప్రేమే ఎంతో స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటుంది. అందుకు అసలైన నిదర్శనం హంసలు (Swans). ఈ పక్షులు ఒక్కసారి జంటగా ఏర్పడితే.. జీవితాంతం ఆ భాగస్వామితోనే కలిసి ఉంటాయి. ఒకవేళ రెండింట్లో ఒకటి చనిపోతే, మరొకటి ఒంటరి జీవితాన్నే గడుపుతుంది. ఇలాంటి అపురూపమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచే ఓ హాట్ టచ్చింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

ఈ వీడియోలో ఓ కొలనులో రెండు హంసలు ఉన్నాయి. అయితే అందులో ఒక హంస మరణించి నీటిలో పడిపోయి ఉండగా, మరొకటి ఆ హంస మరణాన్ని జీర్ణించుకోలేక మళ్లీ దాన్ని లేపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ కనిపిస్తుంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రిటైర్డ్ అధికారి సుసాంత నందా ఎక్స్‌లో షేర్ చేస్తూ.. 'మరణం సైతం విడదీయలేని ప్రేమ. జీవితాంతం కలిసి జీవించేందుకు ఎంచుకున్న తన భాగస్వామిని లేపేందుకు ఈ హంస చేసిన ప్రయత్నం. హంసలు జీవితాంతం జంటగా జీవిస్తాయి. ఒకటి పోతే.. ఇంకొకటి తీవ్రంగా రోధిస్తాయి. కొన్ని బంధాలు శాశ్వతం' అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తున్నారు. 'ఇది కళ్లలో నీళ్లు తెప్పించే దృశ్యం' అంటూ వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

https://x.com/susantananda3/status/1952928695770833078

Next Story