- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru : 'ముక్కాలా.. ముక్కాబులా..' స్టెప్స్ తో అదరగొట్టిన ప్రొఫెసర్.. స్టూడెంట్స్ ఫిదా
ఎప్పుడూ క్లాసులో సీరియస్ గా పాఠాలు బోధించే ప్రొఫెసర్లను చూస్తే స్టూడెంట్స్ కు నిజంగానే బోరు కొడుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఎప్పుడూ క్లాసులో సీరియస్ గా పాఠాలు బోధించే ప్రొఫెసర్లను చూస్తే స్టూడెంట్స్ కు నిజంగానే బోరు కొడుతుంది. కాని అంత సీరియస్ గా ఉండే అధ్యాపకుల అసలైన టాలెంట్ బయటపెట్టిన రోజున మాత్రం ఫిదా అవ్వని స్టూడెంట్స్ ఉండరు. సరిగ్గా బెంగుళూరు(Benagluru)లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటిదే జరిగింది. కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్ లో ఓ ప్రొఫెసర్ 'ముక్కాలా.. ముక్కాబులా..' పాటకు అదిరిపోయే స్టెప్స్(Professor Dance) వేయడంతో, స్టూడెంట్స్ ఈలలు, చప్పట్లు, అరుపులతో ఆడిటోరియం దద్దరిల్లి పోయింది. మెకానికల్ మైఖేల్ జాక్సన్ మీరంటూ స్టూడెంట్స్ ఫిదా అయిపోయారు.
ఈ డ్యాన్స్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. అక్కడ కూడా లైకులు, షేర్లు, కామెంట్ల మోత మోగింది. ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ఒకరు కామెంట్ చేయగా.., మా కాలేజీలో కూడా ఇలాంటి సార్ ఉండాలని మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి ప్రొఫెసర్ కాలేజీలో ఉంటే స్టూడెంట్ హాజరు ఫుల్ గా ఉంటుందని మరొకరు అన్నారు. మరి ఆ మెకానికల్ మైకేల్ జాక్సన్ ప్రొఫెసర్ డ్యాన్స్ ను మీరూ ఓ లుక్కేయండి.






