- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్లాస్‌లో విద్యార్థినికి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్.. చెప్పుతో బుద్ధి చెప్పిన యువతి
బెంగళూరులోని ఓ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ చేసిన పని ఉపాధ్యాయ లోకాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రొఫెసర్ (Professor) క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. అందరిముందే సదరు విద్యార్థినికి ప్రేమ ప్రపోజ్ చేయడమే కాకుండా, చాక్లెట్లు పంచుతానని చెప్పిన ప్రొఫెసర్‌కు ఆ యువతి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు శివార్లలోని నెలమంగళ (Nelamangala) సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహమ్మద్ (Mohammed) అనే ప్రొఫెసర్ క్లాస్ జరుగుతుండగా ఒక విద్యార్థినిని ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా.. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ క్లాస్‌లోనే అందరి ముందు ప్రపోజ్ చేశాడు. అంతటితో ఆగకుండా, ఈ సంతోషకరమైన వార్తను సెలబ్రేట్ చేసుకోవడానికి క్లాస్‌లోని విద్యార్థులందరికీ చాక్లెట్లు పంచుతానని ఒక బాక్సును కూడా బయటకు తీశాడు.
షాక్‌కు గురైన విద్యార్థిని.. చెప్పుతో అటాక్
ప్రొఫెసర్ మాటలకు షాక్ అయిన సదరు విద్యార్థిని.. తాను ఎప్పుడు ప్రపోజ్ చేశానని అతడిని గట్టిగా నిలదీసింది. అందుకు ప్రొఫెసర్ సమాధానమిస్తూ.. ‘నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినట్లు నా దగ్గర సీసీటీవీ (CCTV) ఫుటేజీ కూడా ఉంది’అని వాదించాడు. దీంతో ఆగ్రహం తట్టుకోలేకపోయిన ఆ యువతి, వెంటనే తన చెప్పు తీసి అందరి ముందే ప్రొఫెసర్‌ను కొట్టింది. అయితే, క్లాస్‌రూమ్‌లో జరిగిన ఈ హైడ్రామా మొత్తాన్ని ఇతర విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అది చూసిన జనం ప్రొఫెసర్ ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.






