- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
100 మంది అమ్మాయిల్లో ఇద్దరు మాత్రమే వర్జిన్ : ప్రేమానంద్ మహారాజ్ సంచలన వ్యాఖ్యలు
యూపీలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ అమ్మాయిలపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : యూపీలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ అమ్మాయిలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈరోజుల్లో వర్జిన్ అమ్మాయిలు చాలా అరుదు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఓ కార్యక్రమంలో ప్రేమానంద్ మహారాజ్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో 100 అమ్మాయిల్లో ఇద్దరు మాత్రమే పవిత్రంగా ఉంటున్నారని, మిగిలిన వారు బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ బిజీగా ఉంటున్నారని మాట్లాడారు. పదిమంది అబ్బాయిలతో తిరిగిన అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుందని, పతివ్రత ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
అలాగే నలుగురు అమ్మాయిలతో తిరిగిన అబ్బాయి మంచి భర్త ఎన్నటికీ కాలేడని అన్నారు. పాశ్చాత్య సంస్కృతుల వల్ల మన దేశ సంప్రదాయాలు మంట కలిసి పోతున్నాయని ఆవేదన చెందారు. ప్రేమానంద్ మహారాజ్ అమ్మాయిలు, అబ్బాయిలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మహారాజ్ మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






