- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kamal Kaur: ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్ హత్య..! కలకలం రేపుతున్న చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
లుథియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ (Kamal Kaur) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Punjab) పంజాబ్ రాష్ట్రంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. లుథియానాకు చెందిన (Social Media Influencer) ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ (Kamal Kaur) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్క్ చేసిన కారులో ఆమె మృతదేహం లభ్యం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. మొదట బుధవారం రాత్రి బటిండా-చండీగఢ్ హైవే వెంబడి యూనివర్సిటీ లాట్‌లో ఆగి ఉన్న కారు నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. తాజాగా ప్రాథమిక విచారణలో భాగంగా మృత దేహం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కమల్ కౌర్‌గా పోలీసులు గుర్తించారు.
ఆమెను వేరే చోట హత్య చేసి, ఆ తర్వాత కారులో ఈ ప్రదేశానికి తీసుకొచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కమల్ కౌర్ కుటుంబానికి సమాచారం అందించారు. ఇక కమల్ కౌర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3.83 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఆమె రెగ్యులర్ కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. తరుచూగా బోల్డ్ ఫోటోలు, వీడియోలతో ఆమె పంజాబ్‌లో ట్రెండింగ్‌లో ఒకరిగా ఉండేది. తాజాగా కమల్ కౌర్ అనుమానస్థితిలో మృతి చెందడం పంజాబ్‌లో కలకలం రేపుతోంది.
ఆమె రెండు రోజుల క్రితం చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ (Instagram) సైతం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె పోస్ట్ చేసిన ఫోటో వైరల్ (viral) అవుతోంది. ముఖంలో విచిత్రమైన హావ భావం కలిగి ఉండి.. ఎర్రగా మారినట్లు కళ్లు.. ఫోటోలో మనకు కనిపిస్తాయి. ఎమోషన్ లేదు, లవ్ లేదు, ఫ..క్ లేదు.. మిగిలి ఉన్నది సందేహం, సందేహం, సందేహం మాత్రమే.. అంటూ పంజాబీ భాషలో ఆమె పోస్టులో రాసుకోచ్చింది. దీని నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఆమె అలా ఎందుకు ఉందని, ఆమె మృతికి గల కారణాలు తెలపాలని పోలీస్ శాఖను నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇక అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేశారు.






