- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Los Angeles : లాస్‌ఏంజెల్స్‌లో ఉద్రిక్తతలు.. లైవ్‌లో మహిళా రిపోర్టర్‌పై పోలీస్ కాల్పులు
డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలపై తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెల్స్‌లో భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలోని (Los Angeles) లాస్ ఏంజెల్స్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అక్రమ వలసలపై తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా లాస్ ఏంజెల్స్‌లో భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్మెంట్, నేషనల్ గార్డ్ దళాలు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్స్‌తో కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్‌లను ప్రయోగించారు. ఆ సమయంలో లైవ్‌లో రిపోర్టింగ్ చేస్తోన్న (female reporter) మహిళా రిపోర్టర్‌పై ఓ జవాన్ రబ్బర్ బుల్లెట్‌తో ఆమె కాలుపై కాల్చారు. ఈ ఘటన కెమెరాలో రికార్డు అవ్వడంతో సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కావాలనే ఆస్ట్రేలియా జర్నలిస్ట్, 9 న్యూస్ యూఎస్ కరస్పాండెంట్ లారెన్ టోమాసీ (Lauren Tomasi) అనే మహిళా రిపోర్టర్‌పై రబ్బర్ బుల్లెట్‌తో కాల్చారని నెటిజన్లు ఆరోపించారు.
లాస్ ఏంజెల్స్‌లో ICE (Immigration and Customs Enforcement) విభాగానికి వ్యతిరేకంగా డౌన్ టౌన్‌లో ఆందోళనకారులు విదేశీ జెండాలను ప్రదర్శించారు. మాస్క్ ధరించిన నిరసనకారులు ప్రధాన హైవేను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొంత మంది సెల్ప్‌డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు విసరడం, చాలా పోలీసుల వాహనాలను నిరసనకారులు తగలబెట్టారు. దీంతో లాస్ ఏంజెల్స్‌లో డౌన్ టౌన్ రణరంగంలా మారింది. ఇక, లాస్ ఏంజెలెస్‌లో మాస్కుల్లో ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేయాలని తాజాగా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఆందోళనలతో మాస్క్‌ల వినియోగాన్ని ఆయన నిషేధించారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, లాస్‌ఏంజెల్స్ స్థానిక నాయకత్వం మధ్య ఘర్షణ కూడా పెరుగుతుంది. లాస్ ఏజెంల్స్‌లోని పరిస్థితిని రెచ్చగొట్టింది పాలకవర్గమే అని ట్రంప్ తీరును నగర మేయర్ కరెన్ బాస్ తప్పుపట్టారు. ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరమైన లాస్ ఏంజెల్స్‌ను అక్రమ వలసదారులు, క్రిమినల్స్ ఆక్రమించుకొన్నారని ఆయన మండిపడ్డారు. ఈ ఆందోళనలపై ఎక్స్ వేదికగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో అమెరికా ప్రభుత్వం ఏం చేయాలి? ఈ నిరసనకారులతో చర్చలు జరపాలా? లేక చట్టపరమైన చర్యలు తీసుకోవాలా? అని నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.






