- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు వాహనాలతోనే ప్రధాని మోడీ ప్రయాణం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ప్రధాని నరేంద్ర మోడీ తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) తన భద్రతా కాన్వాయ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రధాని పర్యటనల్లో కనిపించే భారీ వాహన శ్రేణిని (Convoy) ఇప్పుడు భారీగా తగ్గించారు. భద్రతా ప్రోటోకాల్‌లలో ఎటువంటి రాజీ పడకుండానే, ఈ వాహనాల సంఖ్యను కుదించడం విశేషం. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) నిబంధనల ప్రకారం.. అత్యవసర సమయాల్లో అవసరమయ్యే అన్ని భద్రతా విభాగాలు, పరికరాలను కాన్వాయ్‌లో అంతర్భాగంగా ఉంచారు. భద్రతకు అవసరమైన కీలక భాగాలను అలాగే ఉంచుతూనే, కాన్వాయ్‌లోని మొత్తం వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు.
భారీ కాన్వాయ్ వల్ల సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు, ముఖ్యంగా పెట్రోల్ ఆదా అవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వీవీఐపీ (VVIP) సంస్కృతికి దూరంగా ఉండటమే కాకుండా, సామాన్య ప్రజలకు కలిగే అసౌకర్యం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని కేబినెట్ భేటీకి రెండు వాహనాల్లో మాత్రమే హాజరయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






