షాకింగ్.. ఈ అబ్బాయికి ప్రతి నెల పీరియడ్స్..

by Sujitha Rachapalli |

సాధారణంగా అమ్మాయిలకు ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. మూడు రోజులు భరించలేనంత పెయిన్‌ను అనుభవిస్తారు. అయితే ఫిలిప్పీన్స్‌కు చెందిన నోయెల్ అనే అబ్బాయికి ప్రతి నెల రుతుస్రావం జరుగుతుంది. అవును.. మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం.

షాకింగ్.. ఈ అబ్బాయికి ప్రతి నెల పీరియడ్స్..
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా అమ్మాయిలకు ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. మూడు రోజులు భరించలేనంత పెయిన్‌ను అనుభవిస్తారు. అయితే ఫిలిప్పీన్స్‌కు చెందిన నోయెల్ అనే అబ్బాయికి ప్రతి నెల రుతుస్రావం జరుగుతుంది. అవును.. మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం. ఈ విషయాన్ని అతనే స్వయంగా షేర్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తను ప్రతి నెల రుతుక్రమం ఉంటుందని.. అమ్మాయిల మాదిరిగానే నొప్పి, రక్తస్రావం, మూడ్ స్వింగ్స్ ఉంటాయని తెలిపాడు. దీంతో అతను భాగస్వామిని పొందేందుకు కష్టపడ్డానని.. తన పరిస్థితిని ముందే వివరిస్తే ఎవరూ నమ్మలేదని చెప్పాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన అతని కథనం వైద్య నిపుణులను ఆకర్షించింది. అతన్ని పరీక్షించిన ఎక్స్‌పర్ట్స్ పర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ (Persistent Müllerian Duct Syndrome) అనే అరుదైన వైద్య పరిస్థితి ఉందని గుర్తించారు. ఈ కండిషన్‌లో పురుష రోగులు కొన్ని స్త్రీ పునరుత్పాదక అవయవాలను (female reproductive structures) కలిగి ఉంటారు. కాగా నోయెల్ కడుపులో ఉన్న టిష్యూ సైక్లికల్ బ్లీడింగ్‌కు కారణమవుతందని.. ఇది రుతుస్రావం లాగానే ఉందని గుర్తించారు. ఈ పరిస్థితి శారీరకంగా, మానసికంగా నొప్పి కలిగిస్తుంది.

పర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ గురించి..

పర్సిస్టెంట్ ముల్లేరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS) అనేది పురుషులలో ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధి. ఇందులో గర్భంలో అభివృద్ధి దశలో ముల్లేరియన్ డక్ట్‌లు (Müllerian ducts) సరిగ్గా పరివర్తనం కాకుండా... స్త్రీ పునరుత్పాదక అవయవాలు అంటే గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్‌లు కొనసాగుతాయి. దీంతో పురుష జననేంద్రి అవయవాలు, టెస్టికల్స్ సాధారణంగా ఉండటంతోపాటు అంతర్గతంగా స్త్రీ పునరుత్పాదక అవయవాలను కలిగి ఉంటారు. ఇది ‘ప్సూడోహర్మాఫ్రడిటిజం’ రకంగా పరిగణించబడుతుంది.

Next Story