- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంప్లెంట్ చేసింది నువ్వేనా? మాతో రా! రైలు ప్రయాణికుడిపై సిబ్బంది దాడి.. వైరల్
ట్రైన్‌లో క్యాటరింగ్ సిబ్బంది అధిక చార్జీలు వసూలు చేశారని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై ప్యాంట్రీ సిబ్బంది దాడికి పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral Video) ట్రైన్‌లో క్యాటరింగ్ సిబ్బంది (Indian Railway Pantry Staff) అధిక చార్జీలు వసూలు చేశారని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన ప్రయాణికుడిపై ప్యాంట్రీ సిబ్బంది దాడికి పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం హేమకుంట్ ఎక్స్‌ప్రెస్ (14609)లో (Vishal Sharma) విశాల్ శర్మ అనే యూట్యూబర్ ప్రయాణం చేస్తుండగా క్యాటరింగ్ సిబ్బంది అధిక చార్జీలు వసూలు చేశారని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మా పై ఫిర్యాదు చేస్తావా? అంటూ ప్రయాణికుడి వద్దకు వచ్చి ప్యాంట్రీ సిబ్బంది దారుణంగా కొట్టారు. వీడియోలో చూపిస్తున్న ప్రకారం.. 'కంప్లెంట్ చేసింది నువ్వేనా? మాతో రా' అంటూ రైలు సిబ్బంది ముఠాలా వచ్చి అతడిని బెదిరించారు. నేను ఎందుకు రావాలి అని ప్రయాణికుడు ప్రశ్నించాడు. మరోవైపు కోచ్‌లో కొంత మంది ప్రయాణికులు వారిని ఆపే ప్రయత్నం చేయగా ఒక మూకల ప్యాంట్రీ సిబ్బంది ప్రవర్తించారు. ఇక కిందకి రాలేదని అతనిపై దాడికి తెగబడి రక్తం వచ్చేలా కొట్టారు. సదరు ప్రయాణికుడు విశాల్ శర్మ ఈ తతంగాన్నంతా రికార్డ్ చేసి నెట్టింట పెట్టగా ఆ వీడియో వైరల్ అవుతోంది.
ధరల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా? అంటూ నెటిజన్లు సొషల్ మీడియాలో (Indian Railway) రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్, ఐఆర్‌సీటీసీకి ఫర్యాదు చేశారు. దీంతో ఐఆర్‌సీటీసీ, రైల్ సేవా స్పందించింది. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. క్యాటరర్‌పై రూ. 5 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. కథువాలోని జీఆర్పీలో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఫలితాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చింది.






