పరువు తీసిన ప్రధాని.. మిస్టేక్‌లో ‘కండోమ్‌’ పోస్ట్ చేసేశాడు!

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-15 12:45:24  IST  )

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా ఎలా ప్రవర్తిస్తాడనే చర్చ జరుగుతోంది.

పరువు తీసిన ప్రధాని.. మిస్టేక్‌లో ‘కండోమ్‌’ పోస్ట్ చేసేశాడు!
X

దిశ, ఫీచర్స్ : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా ఎలా ప్రవర్తిస్తాడనే చర్చ జరుగుతోంది. ప్రపంచం ముందు దేశం పరువు తీశాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరిగిన ఘటనలపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు షెహబాజ్ షరీఫ్. ఇజ్రాయిల్.. ఇరాన్‌పై చేసిన దాడిని ఖండిస్తున్నట్లు ప్రకటించాడు. కానీ.. ఈ పోస్ట్‌లో ఒక విచిత్రమైన తప్పు జరిగింది. ‘I condemn’ (నేను ఖండిస్తున్నాను) అని రాయాల్సి ఉండగా.. ‘I condom’ (నేను కండోమ్) అని తప్పుగా రాసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ తప్పు చాలా మంది దృష్టిని ఆకర్షించగా.. ఫన్నీ కామెంట్లు, మీమ్‌లు వచ్చాయి.

అయితే దీని గురించి అధికారికంగా ఏదీ నిర్ధారణ కాలేదు. కానీ కొంతమంది దీన్ని ఆటోకరెక్ట్ మిస్టేక్ లేదా టైపో మిస్టేక్‌గా భావిస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం కాస్త సంచలనం సృష్టించేందుకు చేసిన ప్రయత్నమని అనుమానిస్తున్నారు. షెహబాజ్ షరీఫ్ ఇజ్రాయిల్, ఇరాన్ మీద దాడి చేసినందుకు ఆందోళన వ్యక్తం చేసి.. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని కోరాడు. కానీ ఈ తప్పు వల్ల ఆయన ప్రకటన సీరియస్ పొలిటికల్ సిట్యుయేషన్ నుంచి హాస్యాస్పదమైన విషయంగా మారిపోయింది. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. ఆపరేషన్ సిందూర్.. వంటి సంఘటనలు కూడా ఈ పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

Tweet : Shehbaz Sharif said "Condom" instead of "Condemn"

Read Also..

కొత్త బిజినెస్.. కండోమ్ లో రంగు నీళ్లు కొట్టి అమ్మేస్తున్నారు !

Next Story