వామ్మో.. ఆ రైతు ఇంట్లో 100కుపైగా పాములు.. చంపినా కొద్దీ !

by velandi.Saikiran |

సాధారణంగా పాములంటే ( Snakes) అందరికీ భయం వేస్తుంది. అలాంటిది ఒక్కసారి వందలాది పాములు వస్తే.. భయం కాదు గజగజ

వామ్మో.. ఆ రైతు ఇంట్లో 100కుపైగా పాములు.. చంపినా కొద్దీ !
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా పాములంటే ( Snakes) అందరికీ భయం వేస్తుంది. అలాంటిది ఒక్కసారి వందలాది పాములు వస్తే.. భయం కాదు గజగజ వణికి పోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఓ రైతు ఇంట్లో ఏకంగా... దాదాపు 100 పాములు ప్రత్యక్షమైనట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ( Uttar Pradesh) మీరట్ (Meerat) సమీపంలో జరిగింది.

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మీరట్ సమీపంలోని సీమౌళి అనే గ్రామంలో.. నివాసం ఉంటున్న సైఫి ( Saifi) అనే రైతు ఇంట్లో ఒక్కసారిగా వందకు పైగా పాములు ప్రత్యక్షమయ్యాయి. ఆ పాములన్ని బయటకు రావడంతో... గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అవి కాటేస్తాయన్న భయంతో... చాలా మంది పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అటవీశాఖ అధికారులకు... ఆ గ్రామస్తులు ఫోన్ చేశారు.

అర్ధరాత్రి జరగడంతో అధికారులు.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో.. దాదాపు 50 కి పైగా పాములను చంపేశారు గ్రామస్తులు. మరికొన్ని పాములు అడవిలోకి పారిపోయాయి. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకుని ఉదయం పూట ఆ గ్రామానికి చేరుకున్నారు అధికారులు. పాములు రావడం పై విచారణ చేస్తున్నారు. రైతు ఇంటి కింద... పాముల గూడు ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ పరిస్థితి నెలకొంది అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story