- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Sindoor Effect: జస్ట్ ఇమాజిన్.. వాళ్లంతా ఆయుధాలు పట్టుకొని బయల్దేరితే ఎలా ఉంటుందో తెలుసా?
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ బలగాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య పౌరుల నుంచి ప్రముఖుల వరకు భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలను కొనియాడుతూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం జైహింద్, భారత్ మాతాకీ జై అనే నినాదాలు మార్మోగుతున్నాయి. దీంతో #OperationSindoor, #JaiHind, #IndianArmy వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక భారత్ సైన్యం సాధించిన ఈ విజయాన్ని క్రికెట్ అభిమానులు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నెట్టింట పలు ఆసక్తికరమైన ఫొటోలు వైరల్‌గా (Viral) మారాయి. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్‌తో క్రికెట్ లవర్స్ ఏఐ (artificial intelligence) టెక్నాలజీని ఉపయోగించి తమ అభిమాన క్రికెటర్లను ఆర్మీ అధికారులుగా మార్చేసి.. ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు.
క్రీడారంగంలో తలెత్తిన ఆ పోరాట స్పూర్తి, ఇప్పుడు దేశ భద్రత కోసం ఉపయోగపడితే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ నెటిజన్లు దేశభక్తిని నూతన రీతిలో చూపిస్తున్నారు. ఏఐ సాయంతో రూపొందించిన ఫొటోల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి స్టార్ క్రికెటర్లు జెర్సీల్ని పక్కన పెట్టి ఆర్మీ యూనిఫార్మ్ వేసుకుని చేతిలో ఆయుధాలతో కనిపిస్తున్నారు. వీరిని చూస్తే.. స్టేడియంలో పరుగులు తీయడమే కాదు, సరిహద్దుల్లో నిలబడి దేశాన్ని కాపాడగల హీరోలే అనిపిస్తుంది. అంతేకాదు, 'వీరంతా ఆయుధాలు పట్టుకుని వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి' అంటూ పోస్టు పెడుతున్నారు. స్టేడియంలో బౌలర్లను మట్టికరిపించిన భారత క్రికెటర్లు.. ఇప్పుడు సరిహద్దుల్లో ఆయుధాలు పట్టుకుని దేశ రక్షణకై యుద్ధానికి సిద్ధమైతే బీభత్సమే! అంటూ కామెంట్లు పెడుతున్నారు.






