Viral Video : దేశంలో మానవత్వం మంటగలిసే ఘటన.. బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి స్త్రీ..

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-13 19:31:31  IST  )

సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. స్త్రీలను బహిరంగంగ మార్కెట్‌లో అమ్ముతున్నారనేది దీని సారాంశం. కాగా మౌరిటానియా అనే ఇస్లామిక్ కంట్రీలో ఇప్పటికీ ఇలాంటి ఆచారం కొనసాగుతోందని.. 80వేల కంటే ఎక్కువ మంది ఇప్పటికీ బానిసలుగా ఉన్నారని

Viral Video : దేశంలో మానవత్వం మంటగలిసే ఘటన.. బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి స్త్రీ..
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. స్త్రీలను బహిరంగంగ మార్కెట్‌లో అమ్ముతున్నారనేది దీని సారాంశం. కాగా మౌరిటానియా అనే ఇస్లామిక్ కంట్రీలో ఇప్పటికీ ఇలాంటి ఆచారం కొనసాగుతోందని.. 80వేల కంటే ఎక్కువ మంది ఇప్పటికీ బానిసలుగా ఉన్నారని చెప్తోంది. షరియా చట్టం ప్రకారం ఇక్కడ పురుషులు బానిసలను కొనొచ్చని, అమ్మొచ్చని, ఉంపుడుగత్తెలుగా కూడా ఉంచుకోవచ్చని చెప్తోంది. మొత్తానికి ఇక్కడ స్త్రీలను ఆస్తిగా పరిగణిస్తారనే వాదన ఉంది. అక్కడ బానిసత్వం రద్దు చేయబడలేదని.. ఇప్పటికీ కొనసాగుతున్నదనే వాదన జరుగుతోంది. ఇందుకు సాక్షం ఈ వీడియోనే అనే చర్చకు దారితీసింది.

మౌరిటానియాలో బానిసత్వం ఉందా?

పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న మౌరిటానియా జనాభాలో గణనీయబైన భాగం బానిసత్వంలో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. 2016 గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్.. అక్కడి జనాభాలో నాలుగు శాతం మంది అంటే లక్షా యాభై వేల మంది వరకు ఈ పరిస్థితుల్లో బతుకుతున్నారని తెలిపింది. ఇక్కడ వంశపారంపర్య బానిసత్వం కనిపిస్తుందని.. ముఖ్యంగా బీడ్వీన్ అనే ఉన్నత వర్గం.. హరతీన్ అనే సమూహాన్ని బానిసలుగా పరిగణిస్తారని సూచించింది. సామాజిక హోదా, ఆర్థిక అసమానతలతో ఈ వ్యవస్థ పాతుకుపోయిందని తెలుస్తోంది.

కానీ ఆ దేశం అధికారికంగా 1981లో బానిసత్వాన్ని రద్దు చేసింది. 2007లో బానిసత్వాన్ని నేరంగా పరిగణించే చట్టాన్ని ఆమోదించింది. ఒకవేళ బానిసలుగా ఉంచితే ఏడేళ్ల జైలు శిక్ష అమలు చేస్తామని హెచ్చరించింది. 2015లో ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ.. బానిసత్వాన్ని మానవత్వానికి వ్యతిరేకమైన నేరంగా పరిగణించింది. కానీ అమలు మాత్రం అంత గొప్పగా లేదనే వాదన ఉంది. కారణం బానిసత్వ వ్యతిరేక కార్యకర్తలు.. ఈ చట్టాలు కేవలం కాగితాలపైన రాతలేననే వ్యాఖ్యలు చేయడం, శిక్షలు చాలా అరుదు అని మాట్లాడటం ఇందుకు నిదర్శనంగా చూపిస్తున్నారు విశ్లేషకులు.

VIDEO

Next Story