- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పథకం కింద ఇల్లు కావాలన్న వృద్ధురాలు.. కింద పడేసి.. కాళ్లతో తన్నుతూ.. హింసించిన సర్పంచ్ భర్త.. (వీడియో)
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పృథ్వీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానెత గ్రామంలో ఓ వృద్ధురాలిని హింసించాడు గ్రామపెద్ద. 74ఏళ్ల వయసున్న శాంతి అహిర్వార్ పీఎం ఆవాస్

X
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పృథ్వీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానెత గ్రామంలో ఓ వృద్ధురాలిని హింసించాడు గ్రామపెద్ద. 74ఏళ్ల వయసున్న శాంతి అహిర్వార్ పీఎం ఆవాస్ యోజన కింద తన ఇల్లు గురించి ప్రశ్నించగా.. ముసలావిడ అనే కనికరం లేకుండా చేయి మెలేసి, కింద పడేసి, తన్ని హింసించాడు. గ్రామ సర్పంచ్ భర్త అయిన రాజ్ కుమార్ సాహూపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భార్య సర్పంచ్ అయితే ఈయన పెత్తనమేంటి? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అధికారం ఉంది కదా అని ఇలా రెచ్చిపోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఈ ఘటన పాలనలో సెక్స్ డైనమిక్స్ గురించి ప్రశ్నను లెవనెత్తుతోంది.
Next Story






