Trending: వామ్మో సచివాలయమా..! టెర్రర్ పుట్టిస్తున్న వీధి కుక్కలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-11 13:30:15  IST  )

రాష్ట్రంలో ఓ వైపు రేబిస్ మరణాలు గుబులు పుట్టిస్తుంటే.. వీధి కుక్కల స్వైర విహారంతో జనాలు పరేషాన్ అవుతున్నారు.

Trending: వామ్మో సచివాలయమా..! టెర్రర్ పుట్టిస్తున్న వీధి కుక్కలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఓ వైపు రేబిస్ మరణాలు గుబులు పుట్టిస్తుంటే.. వీధి కుక్కల స్వైర విహారంతో జనాలు పరేషాన్ అవుతున్నారు. ఇది ఎక్కడో కాదండోయ్.. సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు ఉండే సచివాలయంలో. ఏంటి షాకయ్యారా..! గత కొన్ని రోజులుగా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ పాస్ లాంజ్‌లో విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూతవేట దూరంలో ఉన్నా సెక్రటేరియట్‌లో కుక్కల గోలను అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సందర్శకులు, సిబ్బంది సెక్రటేరియట్‌‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇప్పటి వరకు ముగ్గురిపై దాడి చేసి కరిచినా.. జీహెచ్ఎంసీ సిబ్బందిలో చలనం లేదు. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలోనే ఇలా ఉంటే.. ఇక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సామాన్య జనం చెవులు కొరుక్కుంటున్నారు.

Next Story