అయ్యో పాపం.. ఈ వానరానికి ఎంత కష్టమొచ్చిందో!

by Jakkula.Mamatha |

రాష్ట్రం(Telangana)లో భగభగ మండిపోతున్న ఎండలు.

అయ్యో పాపం.. ఈ వానరానికి ఎంత కష్టమొచ్చిందో!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Telangana)లో భగభగ మండిపోతున్న ఎండలు. మనుషులే కాదు.. జంతువులు అల్లాడిపోతున్నాయి. వేసవి కాలం వచ్చిందంటే చాలు నీటి ఎద్దడితో ప్రజలు సతమతం అవుతారు. అయితే ఎండలతో మనుషులకే కాదు.. వానరాలకు సైతం తిప్పలు తప్పడం లేదు. ఎండాకాలం కావడంతో తాగునీటి కోసం మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. వేసవి తాపం తట్టుకోలేక ఓ కోతి చాలా కష్టాలు పడుతోంది.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలో దాహంతో ఓ వానరం అల్లాడిపోతోంది. ఓ వైపు మండుతున్న ఎండ.. మరో వైపు చుక్క నీరు లేదు. ఆ వానరానికి ఎంత సేపు నీళ్ల కోసం వెతికిన లాభం కనిపించడం లేదు. ఈ క్రమంలో అటు ఇటు వెతకగా ఒక బురద చెత్తతో నిండిన నీటి గుంట కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి దాహం తీర్చుకోవాలనే అనుకుంది. కానీ ఆ గుంటలో చెత్త, బురద ఉంది. ఇక ఆ వానరం తొలుత చెత్తను తొలగించేందుకు ఆ నీటిని అటు ఇటు కదిలించి.. ఆ తర్వాత బురద నీటిని తాగి దాహం తీర్చుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Next Story