- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానిస్టేబుల్ బర్త్ డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు
మధ్యప్రదేశ్లోని దతియా పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ పుట్టినరోజు ఉండగా తోటి కానిస్టేబుళ్లను, ఏఎస్‌ఐని ఆహ్వానించాడు. అక్కడ మందు చిందుతో పాటు క్లబ్ డ్యాన్సర్లు కూడా ఉండటంతో పోలీసులు రెచ్చిపోయారు. ఫుల్లుగా తాగేసిన తరవాత ఒంటిమీద సోయి లేకుండా ప్రవర్తించారు.

దిశ, వెబ్ డెస్క్: సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా జరిగితే పోలీసులే అక్కడకు వెళ్లి అడ్డుకోవాలి. కానీ పోలీసులే అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది. ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు. కానీ అవేమీ అలోచించకుండా కొంతమంది పోలీసులు పుట్టిన రోజు వేడుకల్లో బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర రీతిలో స్టెప్పులు వేశారు. ఈ ఘటనలో మధ్యప్రదేశ్లోని దతియా పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ పుట్టినరోజు ఉండగా తోటి కానిస్టేబుళ్లను, ఏఎస్‌ఐని ఆహ్వానించాడు. అక్కడ మందు చిందుతో పాటు క్లబ్ డ్యాన్సర్లు కూడా ఉండటంతో పోలీసులు రెచ్చిపోయారు.
ఫుల్లుగా తాగేసిన తరవాత ఒంటిమీద సోయి లేకుండా ప్రవర్తించారు. డ్యాన్సర్లకు డబ్బులు ఇస్తూ, హత్తుకుంటూ ఇష్టారీతిన ప్రవర్తించారు. అంతే కాకుండా ఏదో గణకార్యం చేసినట్టు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసుకున్నారు. అయితే ఆ వీడియో కాస్త బయటకు రావడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు ఏఎస్‌ఐని, కానిస్టేబుళ్లను సస్పెండ్ సస్పెండ్ చేశారు. ఇక వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో పోలీసులు డ్యూటీలో లేనప్పుడు కూడా సరదాగా గడపొద్దా అని కొందరు కామెంట్ చేస్తుంటే, పోలీస్ ఉద్యోగం చేస్తూ ఇవేం పాడు పనులు అంటూ మరికొందరు మండిపడుతున్నారు. video






