- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధి నిర్వహణలో నో కాంప్రమైజ్! వారెవ్వా.. కమలాదేవి అంటున్న నెటిజన్లు
ప్రభుత్వ ఉద్యోగులంటే ఈ రోజుల్లో అందరికీ చులకనే.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగులంటే ఈ రోజుల్లో అందరికీ చులకనే. విధులకు సరిగా హాజరుకారని, అక్రమాలకు పాల్పడతారనే ఓ చెడ్డపేరు ఉంది. ఇక వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులపై అంతకు మించి ఆరోపణలు మనం నిత్యం మీడియాలో చూస్తూనే ఉంటం. ఆరోగ్య కార్యకర్తలు విధులకు డుమ్మా కట్టి ఎంచక్కా.. ఇంట్లో పనులు చేసుకుంటారు. తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా ఓ ఆరోగ్య కార్యకర్త చేసిన సాహసం అందరి చేత ఔరా.. అనిపిస్తోంది.
తాజాగా, హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని సోలన్ (Solan) జిల్లా పరిధిలోని హురాంగ్ (Hurang) గ్రామం భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. అక్కడున్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మండల కేంద్రం నుంచి ఆరోగ్య కార్యకర్త కమలాదేవి పిల్లలకు టీకాలు వేసేందుకు హురాంగ్ గ్రామానికి బయలుదేరింది. భారీ వర్షం, వరదలతో ఊళ్లోకి వెళ్లే రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. అయినా, కమలాదేవి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బండరాళ్లపై లేడి పిల్లలా దూకింది. అనంతరం వాగు దాటి హురాంగ్ గ్రామానికి వెళ్లి చిన్నారులకు టీకాలు వేసింది. అయితే, విధి నిర్వహణలో కమలాదేవి చేసిన స్టంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియో చూసిన జనాలు ఔరా.. అంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://x.com/bigtvtelugu/status/1959067814884708565






