- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారంతో నేసిన చీరలో తళుక్కున మెరిసిన నీతా అంబానీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే... వైరల్ వీడియో
సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నీతా అంబానీ... తను ధరించే దుస్తులతోనూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. అకేషన్‌కు తగినట్లుగా చీరలు,

దిశ, ఫీచర్స్ : సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నీతా అంబానీ... తను ధరించే దుస్తులతోనూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది. అకేషన్‌కు తగినట్లుగా చీరలు, ఆభరణాలను స్పెషల్‌గా డిజైన్ చేయించుకునే ఆమె.. మీడియాకు కనిపించిన ప్రతిసారి అటెన్షన్ క్యాచ్ చేస్తుంది. ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో ధరించిన అవుట్‌ఫిట్స్‌తో అమేజింగ్ అనిపించింది. అంతెందుకు పెంపుడు కుక్క డ్రెసింగ్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకునే నీతా అంబానీ.. తన చీరల విషయంలో ఎంత శ్రద్ధ చూపుతుందో చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే గోల్డెన్ శారీలో కనిపించి అదరగొట్టిన ఆమె.. లుక్స్‌తో వాక్ అనిపించింది. కానీ ఆ చీర ధరతో షాక్ ఇచ్చింది.
అవును... గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ శారీలో తళుక్కుమన్నది ఈ మిలియనీర్. ఇక బంగారంతో నేసిన చీర విలువ అక్షరాలు మూడున్నర కోట్లకుపైనే. కాగా ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కయ్యారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటే ఇదేనేమో అంటున్నారు. ‘ఇందులో వింతేముంది?’, ‘ మనీ మిస్ యూజ్ చేస్తుంది’, ‘అయితే ఏం చేద్దాం’, ‘స్కామ్‌డ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఎప్పటిలాగే తనకు బాగా సూట్ అయిందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.






