- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సముద్ర గర్భంలో సరికొత్త రికార్డులు: అతిపెద్ద జెండా, ఎత్తైన హ్యూమన్ స్టాక్
అండమాన్ సముద్రగర్భంలో భారత స్కూబా డ్రైవర్లు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ సాహస క్రీడల చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. అండమాన్ నికోబార్ (Andaman and Nicobar) దీవుల్లోని స్వరాజ్ ద్వీప్ వేదికగా భారత స్కూబా డ్రైవర్లు (Scuba Divers) సముద్రగర్భంలో అసాధారణ విన్యాసాలు చేసి, కేవలం రెండు రోజుల్లో రెండు వేర్వేరు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డులను నెలకొల్పారు. ప్రసిద్ధ రాధానగర్ బీచ్ వద్ద భారత్ తన తొలి రికార్డును నమోదు చేసింది. సుమారు 2,400 చ.మీ., వైశాల్యం కలిగిన భారీ త్రివర్ణ పతాకాన్ని సముద్రం అడుగున విజయవంతంగా ఆవిష్కరించారు. గతంలో ఈజిప్టు పేరు మీద ఉన్న 2,028 చదరపు మీటర్ల రికార్డును భారత్ అధిగమించింది. ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, అండమాన్ నికోబార్ పోలీసులు, అటవీ శాఖతో పాటు స్థానిక డైవింగ్ సెంటర్లకు చెందిన 223 మందికి పైగా స్కూబా డ్రైవర్లు ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములయ్యారు.
ఎత్తైన ‘హ్యూమన్ స్టాక్’..
లైట్‌హౌస్ డైవ్ సైట్ (Lighthouse Dive Site) వద్ద భారత్ రెండో రికార్డును సృష్టించింది. 14 మంది సాహసవంతులైన స్కూబా డ్రైవర్లు సముద్రం లోపల ఒకరిపై ఒకరు నిలబడి 22.3 మీటర్ల ఎత్తులో నిలువు వరుసను(Tallest Human Stack) నిర్మించారు. నీటి లోపల ఉండే ఒత్తిడిని తట్టుకుంటూ ఈ హ్యూమన్ స్టాక్ సుమారు 3 నిమిషాల పాటు స్థిరంగా ఉండి గిన్నిస్ ప్రతినిధులను ఆశ్చర్యపరిచింది. ఈ రెండు అద్భుత సాహసాలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్ స్వయంగా పర్యవేక్షించి, రికార్డులను అధికారికంగా ధృవీకరించారు.






