నవ వధూవరుల శోభనం గది వీడియోలు వైరల్.. ఆ జంట ఫీలింగ్స్ అదుర్స్.. పార్ట్-2 కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్స్ పోస్టులు

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-17 11:06:59  IST  )

సోషల్ మీడియా వచ్చాక జనాలు ఏది పడితే అది షేర్ చేసుకోవడం ఎక్కువైపోయింది. ప్రైవసీ అనే మాట లేకుండా అన్నింటికి సంబంధించిన వీడియోలను ఓపెన్‌గా షేర్ చేస్తున్నారు.

నవ వధూవరుల శోభనం గది వీడియోలు వైరల్.. ఆ జంట ఫీలింగ్స్ అదుర్స్.. పార్ట్-2 కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్స్ పోస్టులు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వచ్చాక జనాలు ఏది పడితే అది షేర్ చేసుకోవడం ఎక్కువైపోయింది. ప్రైవసీ అనే మాట లేకుండా అన్నింటికి సంబంధించిన వీడియోలను ఓపెన్‌గా షేర్ చేస్తున్నారు. లైక్స్, ఫాలోవర్స్, డబ్బు కోసం హద్దు అనేది లేకుండా పిచ్చి పనులన్నీ చేసేస్తున్నారు. అందరిచేత ఛీ అనిపించుకుంటున్నారు. ఇలాంటిదే ఈ వీడియో కూడా. పెళ్లి తర్వాత శోభనం ఘట్టం అనేది చాలా పవిత్రమైనది. కానీ ఈ జంట దీన్ని కూడా రీల్స్ కోసం వాడేశారు.

శోభనం గదికి వెళ్లే ముందు కొత్తబటల్లు, మల్లెపూల దండలు వేసుకుని.. పాల గ్లాసు పట్టుకుని సిగ్గుపడుతుండగా.. లోపలికి వెళ్లి ఎంజాయ్ చేయమంటూ ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్. లోపలికి వెళ్లాక బెడ్ ఎలా సర్దారు.. ఎలా ఉండాలనేది కూడా చెప్పారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు పిచ్చి పిచ్చిగా తిడుతున్నారు. ఇలా శోభనం గది వీడియోలను పది మందితో పంచుకునేందుకు సిగ్గులేదా అని తిట్టిపోస్తున్నారు. ఫస్ట్ పార్ట్ అదిరింది.. మరి సెకండ్ పార్ట్ ఎప్పుడంటూ ఇంకొందరు ట్రోల్ చేస్తున్నారు.

Next Story