- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Himanshi: పహల్గాంలో మరణించిన నేవీ ఆఫీసర్ భార్య వ్యాఖ్యలపై నెట్టింట తీవ్ర వ్యతిరేకత!!
జమ్ము కశ్మీర్‌లోని (Pahalgam attack) పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ గురించి అందరికీ తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్ము కశ్మీర్‌లోని (Pahalgam terror attack) పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ (Navy officer Vinay Narwal) గురించి అందరికీ తెలిసిందే. హనీమూన్ కోసం పహల్గాం వచ్చిన వినయ్ నర్వాల్ పెళ్లి అయిన ఆరు రోజులకే ఉగ్రదాడిలో మరణించడం దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. తాజాగా వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి నర్వాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హర్యానాలోని కర్నాల్‌లో గురువారం అతడి పుట్టిన రోజు సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అధికారులు, కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వినయ్ నర్వాల్ భార్య హిమాన్షి (Himanshi Narwal) మీడియాతో మాట్లాడారు. ముస్లింలు, కశ్మీరీలకు వ్యతిరేకంగా ప్రజలు ఎవరూ వెళ్లొద్దని ఆమె అన్నారు. మాకు శాంతి మాత్రమే కావాలి.. ఉగ్రదాడికి కారణం అయిన వారిని శిక్షించి మాకు న్యాయం చేయండి అని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే, ఆమె మాట్లాడిన మాటలను కొంత మంది తప్పుబడుతున్నారు. ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చానీయాంశంగా మారింది. ఆమెపై కొంత మంది నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. భర్తను ఇస్లాం ఉగ్రవాదులు మతం అడిగి మరి చంపితే.. తాను సెక్యూలర్‌లా మాట్లాడటం ఏమిటని కొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చాలా కోల్పోయినప్పటికీ మత సామరస్యం కోసం వ్యాఖ్యలు చేశారని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తను పర్ఫెక్ట్ సైనికుడి భార్యల మాట్లాడిందని నెటిజన్‌లు సెల్యూట్ చెప్పారు.
కాగా, ఏప్రిల్ 16న ఈ జంట వివాహం చేసుకున్నారు. వివాహానంతరం హనీమూన్ కోసం పహల్గాం వచ్చిన వినయ్ నర్వాల్ జంట.. ఉగ్రదాడిలో మరణించాడు. ఇక, 26 ఏళ్ల వినయ్ నర్వాల్‌ని అమరవీరుడి హోదా ఇవ్వాలని ఆ కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఈ శిబిరానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే జగ్మోహన్ ఆనంద్ రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని భరోసా ఇచ్చారు.






