Viral video: నిండు గర్భిణీ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-06 08:40:58  IST  )

సాధారణంగా గర్భిణీ స్త్రీలు (Pregnant women) శ్రమ తక్కువగా ఉండే పనులు చేయటం, నెమ్మదిగా నడువటం, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటం వంటివి చేస్తుంటారు.

Viral video: నిండు గర్భిణీ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా గర్భిణీ స్త్రీలు (Pregnant women) శ్రమ తక్కువగా ఉండే పనులు చేయటం, నెమ్మదిగా నడువటం, ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటం వంటివి చేస్తుంటారు. నెలలు నిండే వరకు చిన్న చిన్న వ్యాయామాలు మాత్రం పాటిస్తుంటారు. వైద్యులు కూడా దాదాపు ఇవే సలహాలు సూచిస్తుంటారు. కానీ ఓ నిండు గర్భిణీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఫుల్ ఎనర్జీతో నృత్యం (Dance) చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉండలేరు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో (Social media) విశేషంగా వైరల్‌ (Viral) అవుతోంది.

వీడియోలో స్పానిష్ పాటకు ఓ నిండు గర్భిణీ.. చేతులు, కాళ్ళు, శరీరాన్ని ఊపుతూ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. కడుపులో బిడ్డ ఉన్నాడని తెలిసి ఏమాత్రం భయం, వణుకు లేకుండా.. డ్యాన్స్ ఫ్లోర్‌పై తన స్టెప్పులతో ఇరగదీసింది. నిండు గర్భిణీ అయినప్పటికీ ఆమె చూపించిన ఎనర్జీ, ఫ్లెక్సిబిలిటీ, ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె డ్యాన్స్ చూసి చుట్టూ ఉన్న సైతం ఇలాలు, గోలాలు వేయటం ప్రారంభించారు. అయితే, ఆమె కేవలం డ్యాన్స్ చేయడమే కాదు.. గర్భధారణ సమయంలో స్త్రీలు ఎంత శక్తివంతంగా, సృజనాత్మకంగా ఉండగలరో అనేది కూడా ఈ డ్యాన్స్‌తో చూపించింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. 'సూపర్‌ యాక్టివ్‌ ఉమెన్' అంటూ, డ్యాన్స్ ఇరగదీశారంటూ కామెంట్లు పెడుతున్నారు. మరీ ఇంకేందుకు అలస్యం ఆ డాన్స్ మీరు విక్షీంచండి.

Click For Tweet..

Next Story