న్యూ ఇయర్ వేళ.. తల్లీకొడుకుల ప్రేమకు నెటిజన్లు ఫిదా..!

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-01 10:20:06  IST  )

న్యూ ఇయర్(2026) వచ్చేసింది.

న్యూ ఇయర్ వేళ.. తల్లీకొడుకుల ప్రేమకు నెటిజన్లు ఫిదా..!
X

దిశ,వెబ్‌డెస్క్: న్యూ ఇయర్(2026) వచ్చేసింది. చిన్న పెద్ద ఎంతో సంతోషంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి 12 గంటలకే అందరూ కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చుతూ ఎంతో ఉత్సహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఇక, నూతన ఏడాదిలో మొదటి(జనవరి 1) రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, Happy New Year, Welcome 2026 వంటి అక్షరాలతో కూడిన రంగోలి డిజైన్స్ వేస్తుంటారనే విషయం తెలిసిందే. రంగుల పొడి, మెరిసే మెరుపులు ఉపయోగించి ఆకర్షణీయమైన ముగ్గులు, పువ్వుల డిజైన్లు ఇంటికి పండుగ వాతావరణాన్ని తెస్తాయి.

అయితే.. 2026 న్యూ ఇయర్ వేళ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ పిల్లాడు తన తల్లికి ఇంగ్లీష్‌లో న్యూ ఇయర్ అంటూ ముగ్గు వేయడాన్ని నేర్పించాడు. ఆ తర్వాత ఆమె చేత ముగ్గు పొడితో ‘Happy New Year-2026’ అని రాయించాడు. తన కొడుకు చెబుతున్న అక్షరాల సరళిని తల్లి ఏ మాత్రం తప్పు చేయకుండా చాలా కచ్చితత్వంతో రాశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఈ తల్లీకొడుకుల ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Next Story