- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నైలో కాకుల మిస్టరీ మరణాలు
తమిళనాడులో కాకుల వింత మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో కాకుల వింత మరణాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. చెన్నైలోని అడయారు ప్రాంతంలో ఆకాశంలో ఎగురుతున్న కాకులు అకస్మాత్తుగా కిందపడి చనిపోతున్నాయి. కొన్ని కిందపడిపోయి ఒకటీ రెండు రోజులకు ప్రాణాలు వదులుతున్నాయి. అడయారులోని ఇందిరానగర్ పార్క్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గత వారం నుంచి వరుసగా కాకులు చనిపోతుండటం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గత వారం రోజులుగా గాల్లో ఎగురుతూ ఉన్న కాకులు ఒక్కసారిగా కింద పడిపోవడం, ఎగరలేని స్థితిలో ఒకటి రెండు రోజులు బతికి తరువాత చనిపోవడం గమనించారు. జనవరి 7 నాటికి 30కి పైగా కాకులు చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలు ఇందిరానగర్ పార్క్‌తో పాటు అడయారు రోడ్లు, వెలచేరి, నీలాంకరై ప్రాంతాల్లో కూడా నమోదయ్యాయి. కాకులు మత్తుగా ఉన్నట్టుగా కనిపించడం వల్ల ఇది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ లేదా నీటి కాలుష్యం వల్ల జరిగి ఉండవచ్చని వెటర్నరీ అధికారులు అనుమానిస్తున్నారు.
చనిపోయిన కాకుల నమూనాలను తమిళనాడు వెటర్నరీ అండ్ అనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ (TANUVAS) పరిశీలిస్తోంది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు మాత్రం కాకుల మరణాల మిస్టరీని త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధి ఉండొచ్చన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతుండగా, ఇప్పటివరకు మనుషులకు ప్రమాదం ఉందని ఎలాంటి నిర్ధారణ లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే స్థానికులు ఎవరూ చనిపోయిన కాకులను చేతులతో తాకవద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






