వారెవ్వా...ఒకే వేదికపై హిందూ-ముస్లిం జంటల పెళ్లి !

by velandi.Saikiran |   (  Updated:2025-05-22 19:30:32  IST  )

ఒకే వేదికపై హిందూ ( HINDU), అదే సమయంలో ముస్లిం (Muslim) జంటల పెళ్లి వేడుక జరిగిన సంఘటన ఎప్పుడైనా చూసారా ? అలా

వారెవ్వా...ఒకే వేదికపై హిందూ-ముస్లిం జంటల పెళ్లి !
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకే వేదికపై హిందూ ( HINDU), అదే సమయంలో ముస్లిం (Muslim) జంటల పెళ్లి వేడుక జరిగిన సంఘటన ఎప్పుడైనా చూసారా ? అలా జరగడం అసాధ్యం. కానీ మహారాష్ట్రలో ( Maharastra ) కురుస్తున్న వర్షాల కారణంగా.. హిందూ, ముస్లింల పెళ్లి ఒకే వేదికపై జరిగింది. ఈ అరుదైన సంఘటన మహారాష్ట్రలోని పూణేలో తాజాగా చోటుచేసుకుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని పూణేలో... భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. పూణేలోని వనవాడి ప్రాంతంలో... ఓ హిందూ కుటుంబానికి సంబంధించిన వివాహం కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం చోటుచేసుకుంది. దీంతో టెంట్ల కిందకు కూడా వరద నీరు వచ్చింది. టెంట్ల పై నుంచి కూడా కారణం మొదలైంది. దీంతో ఆ వివాహ వేడుకకు ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో ముహూర్తం ముగుస్తుందని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే పక్కనే ఉన్న ఓ కళ్యాణ మండపానికి పరుగు పరుగున వెళ్లారు.

అదే సమయంలో.. ఆ మండపంలో ఓ ముస్లిం జంట రిసెప్షన్ జరుగుతోంది. దీంతో వాళ్ళ పరిస్థితిని ముస్లిం కుటుంబ సభ్యులకు తెలియజేశారు హిందువులు. పరిస్థితిని అర్థం చేసుకున్న ముస్లిం పెళ్లి వారు.. ఆ హిందూ జంట వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. అనంతరం హిందూ అలాగే ముస్లిం జంటలు కలిసి ఫోటోలు కూడా దిగాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... నెటిజెన్స్ స్పందిస్తున్నారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్... అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బార్డర్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన జరగడం.. హాట్ టాపిక్ అయింది.

Next Story