- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్టుపై నుండి నోట్ల వర్షం.. ఎగబడ్డ జనాలు.. వైరల్ అవుతున్న వీడియో
కోతులు చేసే కొన్ని పనులు గమ్మత్తుగా ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా వస్తువు కనిపించిందంటే చాలు అక్కడ నుండి ఎత్తుకుపోతుంటాయి. అందులో ఆహారపదార్థాలు ఉంటాయనుకుంటాయో ఓమో కానీ, కనిపించిన ప్రతిదాన్ని ఎత్తుకుపోతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: కోతులు చేసే కొన్ని పనులు గమ్మత్తుగా ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా వస్తువు కనిపించిందంటే చాలు అక్కడ నుండి ఎత్తుకుపోతుంటాయి. అందులో ఆహారపదార్థాలు ఉంటాయనుకుంటాయో ఓమో కానీ, కనిపించిన ప్రతిదాన్ని ఎత్తుకుపోతుంటాయి. చివరికి అందులో ఎలాంటి ఆహారం లేకపోతే గాలిలోకి విసిరేస్తాయి. తాజాగా అలాంటి ఘటనే యూపీలో చోటు చేసుకుంది. కానీ ఇక్కడ కోతి ఏకంగా నోట్ల కట్టలను ఎత్తుకెళ్లింది. యూపీలోని బులందర్ లో ఒక కోతి చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల నోట్లను కిందకు విసిరేసింది. దీంతో జనాలు ఎగబడి వాటిని తీసుకున్నారు.
చెట్టుపై నుండి డబ్బులు కింద పడుతుంటే క్షణం ఆగకుండా తీసేసుకున్నారు. ఆ డబ్బును కోతి ఓ న్యాయవాది వద్ద దొంగలించి అలా పంచిపెట్టింది. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ న్యాయవాది తన బ్యాగులో డబ్బులు తీసుకుని రాగా అతడి వద్ద నుండి కోతి లాక్కుంది. అనంతరం అతడికి దొరక్కుండా బ్యాగుతో చెట్టు ఎక్కేసింది. అనంతరం డబ్బును చెట్టుపై కూర్చుని కిందకి విసిరేసింది. డబ్బంతా విసిరేసి ఆ బ్యాగు కూడా అక్కడే వదిలేసి పారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.






