చికెన్ పరోటాలు అమ్ముతున్న కోతి..క్యూట్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ వీడియోలు పెరిగిపోయాయి. ముఖ్యం ఫన్నీ

చికెన్ పరోటాలు అమ్ముతున్న కోతి..క్యూట్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ వీడియోలు పెరిగిపోయాయి. ముఖ్యం ఫన్నీ వీడియోలను, అసలు ప్రాక్టికల్ గా చేయలేని వాటిని సైతం ఏఐ సహాయంతో వీడియోలు రూపొందిస్తున్నారు. ఎక్కువగా జంతువుల ఫన్నీ వీడియోలు రూపొందిస్తూ నవ్వులు పూయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే మోంకేష్ భాయ్ వీడియో.. ఇందులో ఒక కోతి కష్టపడి పనిచేస్తూ కనిపిస్తుంది.

ఇండియాలో కోతి స్ట్రీట్ ఫుడ్ అమ్ముతుండగా చుట్టూ జనాలు ఎగబడి కొనేస్తున్నారు. అచ్చం మనుషుల మాదిరిగానే కోతి ఈ వీడియోలో ఫుడ్ తీసి సర్వ్ చేయడం, దానిని అందంగా డెకరేట్ చేయడం కనిపిస్తుంది. ఇక ఆ కోతికి స్టాల్ వద్ద గిరాకీ చూస్తే మతిపోవాల్సిందే. స్టాల్ చుట్టూ ఫుడ్ కోసం జనాలు క్యూ కట్టేశారు. ఇద్దరు వ్యక్తులు కోతిని వీడియో తీస్తుండగా అది ఒక ప్లేట్ లో పరోటాలు పెడుతూ అందులో చికెన్ కర్రీ వేస్తూ కనిపిస్తుంది. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్లు పెడుతున్నారు.

Next Story