Viral Video: మోనాలిసాను భయపెట్టిన వందలకొద్ది పాములు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-24 08:42:23  IST  )

మోనాలిసా భోంస్లేను వందలకొద్ది పాములు భయపెట్టాయి..

Viral Video: మోనాలిసాను భయపెట్టిన వందలకొద్ది పాములు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్ డెస్క్: మహా కుంభమేళా(Maha Kumbhmela)లో సహజ సౌందర్యంతో కనిపించిన మోనాలిసా భోంస్లే(Monalisa Bhonsle) పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మోగిపోతోంది. ఏ టీవీ, న్యూస్ పేపర్ చూసినా ఆమె వార్తలు కనిపిస్తున్నాయి. మహాకుంభ మేళాలో పూసలు అమ్మిన ఆడపిల్ల అమాయకపు చిరునవ్వుతో దేశం మొత్తాన్ని ఆకర్షించింది. ఇప్పుడు ఏ హీరోయిన్‌కు కూడా లేనంత స్టార్ డమ్ వచ్చేసింది. దీంతో అత్యంత ఫేమస్ అయిపోయింది.

అయితే మోనాలిసా క్రేజ్‌ను కొందరు విచ్చలవిడిగా వినిగించుకుంటున్నారు. ఇన్ స్ట్రాగామ్‌లో వైరల్ అయిన వీడియో చూస్తే ఈ విషయం అర్ధమవుతోంది. ప్రయాగ్ రాజ్‌(Prayag Raj)లో పూసలమ్ముతున్నప్పుడు తీసిన వీడియోను ఏఐ టెక్నాలజీతో ఇంకోలా మార్చి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మోనాలిసా పూసలమ్ముతున్నప్పుడు ఒక్కసారిగా ఆమె సంచిలో నుంచి వందల కొద్ది పాములు బయటకు వచ్చాయి. దీంతో ఆమె బెదిరిపోయి వెనక్కి పడిపోయారు. పాములు స్పీడుగా వెళ్తున్న సమయంలో ఆమెతో పాటు పక్కనున్న వాళ్లు కూడా భయపడిపోయేలా ఉన్న ఈ వీడియోను ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది.

Next Story