- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Online Order: మోచీ చెప్పులు కాదు.. మోసపోయిన చెప్పులు!
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్ అనేది సామాన్యంగా మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్ అనేది సామాన్యంగా మారిపోయింది. కోల్డ్ డ్రింక్ నుంచి ఖరీదైన ఎలక్ట్రానిక్స్ వరకు.. మొబైల్‌లో రెండు క్లిక్‌లతోనే ఇంటి తలుపు ముంగిటకు వస్తున్నాయి. ట్రాఫిక్, షాపింగ్ మాల్స్, క్యాష్ కౌంటర్ల గందరగోళం అన్నీ వదిలేసి, ఇంట్లో కూర్చొని కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేసే సౌకర్యం సౌలభ్యంగా మారింది. అయితే, ఈ సౌకర్యం లోపల కొన్ని చేదు అనుభవాలు కూడా దాగున్నాయి. ఎంతో నమ్మకంగా ఖరీదైన బ్రాండెడ్ ఉత్పత్తులు బుక్ చేస్తే, వస్తున్నది మాత్రం అసలు ఊహించని విధంగా ఉండటమేగాక, వినియోగదారుల్లో అసహనాన్ని రేపుతోంది. ఇలాంటి సంఘటనే తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఖమ్మం జిల్లా బోదులబండకు చెందిన కాకాని సీతారాంచౌదరి అనే యువకుడు ఇటీవల ప్రముఖ ఈ-కామర్స్ యాప్ అయిన మింత్రాలో (Mnytra) 'మోచీ మెన్ లెదర్ కంఫర్ట్ శాండిల్స్ (Mochi Men Leather Comfort Sandals)'ను బుక్ చేశాడు. చెప్పుల ధర రూ.3,990 ఉండగా, ఆర్డర్ సమయంలోనే ఆయన ముందస్తుగా చెల్లించాడు. సోమవారం వచ్చిన పార్సిల్ తెరిచి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అందులో కొత్త చెప్పుల స్థానంలో ఒక పాత, మురికి పడిన చెప్పు కనిపించింది. మినిమమ్ హైజీన్ కూడా లేకుండా పూర్తిగా వినియోగించిన చెప్పు పార్సిల్‌లో ఉండటంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన, వెంటనే మింత్రా యాప్ నిర్వాహకులను సంప్రదించి జరిగిన మోసం గురించి వివరించారు. దీనిపై మింత్రా కస్టమర్ కేర్ ఫిర్యాదు నమోదు చేసినట్లు సమాచారం. అయితే, ఇటువంటి ఘటనలు రోజు రోజుకీ పెరుగుతుండటంతో, వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నాయి. ఇక ఈ విషయాన్ని సదరు కస్టమర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తీవ్ర చర్చ జరుగుతోంది.
కాగా, ఆన్‌లైన్‌లో విలువైన వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు.. డెలివరీ వస్తువులను తీసుకునేటప్పుడు ప్యాకేజింగ్ స్టేటస్ (Packaging status)ను పరిశీలించడం, వీడియో తీసుకోవడం, అనుమానాస్పద వస్తువు వచ్చినపుడు వెంటనే ఫోటోలు తీసి, సంబంధిత సంస్థకు రిపోర్ట్ చేయడం వంటి చర్యలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.






