- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ చీరలో మెరిసిన మంత్రి కొండా సురేఖ.. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ (Telangana Rising Global Summit-2025)లో పెట్టుబడులు వెల్లువెత్తాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ (Telangana Rising Global Summit-2025)లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు తొలి రోజైన సోమవారం రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సమ్మిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ-పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఇందిరమ్మ చీరను కట్టుకొని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఆమెను చూసిన మంత్రులు, అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ చీర కట్టిన సురేఖ ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
కాగా, ఫ్యూచర్ సిటీ (Future City) వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోతున్న పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ దేశీయ, విదేశీ అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటితో పాటు పలు ప్రైవేటు సంస్థలు కూడా తమ ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్స్‌ను ప్రదర్శించాయి. ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో గెస్ట్‌లకు వెల్‌కమ్ చెప్పేందుకు, కావాల్సిన స్టాల్స్‌కు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేకమైన రోబోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.






