- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్ఫ్, యూరియాతో ఇంట్లోనే పాల ప్యాకెట్ల తయారీ.. షాకింగ్ వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో ఏం తినాలన్నా తాగాలన్నా అన్నింటిని కల్తీ చేస్తున్నారు. కారంలో ఇటుకపొడి కలపడం, మసాలాల్లో చెక్కపొడి, అల్లంలో అరటితొక్క ఇలా ఏది ముట్టుకున్నా కల్తీనే.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఏం తినాలన్నా తాగాలన్నా అన్నింటిని కల్తీ చేస్తున్నారు. కారంలో ఇటుకపొడి కలపడం, మసాలాల్లో చెక్కపొడి, అల్లంలో అరటితొక్క ఇలా ఏది ముట్టుకున్నా కల్తీనే. ఇక ప్రతిరోజూ తాగే పాలను సైతం కల్తీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బట్టలు ఉతకడానికి ఉపయోగించే సర్ఫ్, యూరియా, శుద్ధి చేసిన నూనె, సింథటిక్ రసాయనాలతో ఓ వ్యక్తి ఇంట్లోనే పాలను తయారు చేస్తున్నాడు.
దర్జాగా ఇంట్లో కూర్చుకుని రసాయనాలతో పాలు తయారు చేసి వాటిని ప్యాకెట్లలో నింపుతున్నాడు. దీనిపై సమాచారం అందడంతో అధికారులు అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన ముంబైలోని అంధేరి కపస్వాడిలో జరిగినట్టు తెలుస్తోంది. ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. దీంతో కల్తీ పాలు తయారు చేస్తున్న కేటుగాడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కల్తీ పాల వల్ల ప్రాణాలే పోతాయని చిన్నపిల్లలకు తాగించే పాలను సైతం ఇలా పాడు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. VIDEO






