మధ్యాహ్న భోజనం పథకం.. పిల్లలతోనే బోళ్లు తోమిస్తున్న టీచర్లు.. (వీడియో)

by Sujitha Rachapalli |

మధ్యాహ్న భోజనం పథకం కింద పిల్లలకు స్కూల్‌లోనే భోజనం పెడుతున్నారు. ఇందుకోసం ఓ టీమ్ పని చేస్తుంది. వండటం, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం, తర్వాత బోళ్లు కడిగి శుభ్రం చేయడం.. ఇది వాళ్ల పని. కానీ ఈ స్కూల్‌లో ఇందుకు భిన్నంగా ఉంది.

మధ్యాహ్న భోజనం పథకం.. పిల్లలతోనే బోళ్లు తోమిస్తున్న టీచర్లు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : మధ్యాహ్న భోజనం పథకం కింద పిల్లలకు స్కూల్‌లోనే భోజనం పెడుతున్నారు. ఇందుకోసం ఓ టీమ్ పని చేస్తుంది. వండటం, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం, తర్వాత బోళ్లు కడిగి శుభ్రం చేయడం.. ఇది వాళ్ల పని. కానీ ఈ స్కూల్‌లో ఇందుకు భిన్నంగా ఉంది. భోజనం వండిన పెద్ద పెద్ద బాసండ్లను చిన్న పిల్లలే కష్టపడి తోమి కడుగుతున్నరు. రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ జిల్లా చాక్సూ నంబర్ 1కు చెందిన ప్రాథమిక విద్యాలయంలో ఈ సీన్ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలు బోళ్లను కాదు భవిష్యత్తును కడిగేస్తున్నరు అంటూ పోస్టులు వచ్చేస్తున్నాయి. ఆడుకోవాల్సిన పిల్లల చేతులు కష్టం చేస్తున్నాయని.. ఇంట్లో కూడా ఇలాంటి పనులు చేసి ఉండరనే కామెంట్స్ వస్తున్నాయి.

VIDEO

Next Story