- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIDEO: వైకల్యం శరీరానికే టాలెంట్‌కి కాదు!
ఓ వ్యక్తికి పుట్టుకతోనే రెండు చేతులు లేకేపోయినా ఫ్లూట్ ఊదుతూ.. బ్యాండ్ కొడుతున్నాడు. రెండు చేతులు కూడా సగం వరకే ఉండగా వాటితోనే అసలు అలుపులేకుండా బ్యాండ్ కొడుతూ మధ్య మధ్యలో ఫ్లూట్ ఊదుతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: కొంతమందికి వైకల్యం ఉన్నా టాలెంట్ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. దీంతో వైకల్యాలను అధిగమించి అద్భుతాలను సృష్టిస్తుంటారు. ఎవరూ చేయనివి చేయలేనివి కూడా చేస్తూ వావ్ అనిపిస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి పుట్టుకతోనే రెండు చేతులు లేకేపోయినా ఫ్లూట్ ఊదుతూ.. బ్యాండ్ కొడుతున్నాడు.
రెండు చేతులు కూడా సగం వరకే ఉండగా వాటితోనే అసలు అలుపులేకుండా బ్యాండ్ కొడుతూ మధ్య మధ్యలో ఫ్లూట్ ఊదుతున్నాడు. అక్కడితో ఆగకుండా కాళ్లతో చిడతలు వాయిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ అతడి భిక్షాటన చేయడంతో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతడు ఎవరో కానీ ప్రభుత్వం సాయం చేసి ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఇలాంటి కళాకారులను ఎంకరేజ్ చేస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని అంటున్నారు. VIDEO






