PHOTOS: ఈ మీమ్స్ చూస్తే కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం..

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-18 07:02:51  IST  )

ఇన్‌స్టాగ్రామ్(Instagram), ఫేస్‌బుక్, ఎక్స్‌ వాడే వారికి మీమ్స్(Memes) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

PHOTOS: ఈ మీమ్స్ చూస్తే కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్టాగ్రామ్(Instagram), ఫేస్‌బుక్, ఎక్స్‌ వాడే వారికి మీమ్స్(Memes) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూడు గంటల సినిమా కూడా ఇవ్వని ఆనందాన్ని ఒక చిన్న మీమ్ ఇస్తుంది. కొన్ని మీమ్స్ ఒత్తిడిని దూరం చేస్తాయి.. మరికొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. అలాంటి వాటిలో కొన్ని ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నారు. అందులో ‘‘పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. డాగ్స్‌‌కి ఏం తెలుసు డవ్ సోప్ వాసన.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన’’ అనేవి తెగ వైరల్ అవుతున్నాయి. వాటికి కింద రియాక్షన్‌ ఆ వాసనలు వాటికి ఎందుకు తెలియాలి బ్రో క్యాప్షన్‌ను జోడిస్తున్నారు. దానికి కొందరు.. నిజమే కదా మన కోపాన్ని జంతువులను విమర్శిస్తూ చేయడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు.

మీమ్స్‌(Memes)లో వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ తెగ వాడేస్తున్నారు. ముఖ్యంగా నటుడు బ్రహ్మానందం(Brahmanandam) మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో చెప్పడానికి జీవితకాలం కూడా సరిపోదు. సినీ నటుల(Movie Actors)తో పాటు రాజకీయ అంశాలపై కూడా మీమర్లు ప్రతి రోజూ మీమ్స్, ట్రోల్స్ ఇస్తున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి కొన్ని మీమ్స్, ట్రోల్స్‌ పట్ల కొందరు నెగిటివ్‌గా ఇంకొందరు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.






Next Story